ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే మాటల ముందు కల్కి సినిమా కూడా పనికి రాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే మాటల ముందు కల్కి సినిమా కూడా పనికి రాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివేకానంద మాట్లాడుతూ సీఎం మాటల ముందు కల్కి సినిమా కూడా పనికి రాదని, 3డీ అద్దాలు లేకుండానే 3డీ సినిమా చూపిస్తున్నాడని మండిపడ్డారు. న్యూయార్క్ సిటీ తల దాన్నే విధంగా మహేశ్వరంలో సిటీ చేస్తా అన్నాడు. న్యూయార్క్ సిటీ కట్టడానికి 200 ఏండ్లు పట్టిందని అది కూడా అంత టైమ్ అవుతుందని అన్నారు. శంషాబాద్లో మెడికల్ టూరిజం హబ్ అంటాడు ఏం చేస్తాడు అక్కడ హబ్ కట్టి అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఎలా ఉన్నాయి అంటే ఉట్టికి ఎక్కలేని వాడు స్వర్గానికి ఎక్కినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మార్పు పిచ్చిలో పడి పేర్లు మారుస్తున్నాడని, కానీ పని ఏం చెయ్యాలో తెలియట్లేదని విమర్శించారు. పరిపాలన గాలికి వదిలేస్తున్నాడని, గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని గతంలో అసంపూర్తిగా ఉన్న పనులను ఎలా ముందుకు తీసుకు పోవాలి, కొత్త పనులు ఏం చేపట్టాలి అనేది మర్చిపోయారన్నారు. మార్పు, మార్పు అనే దాన్ని పట్టుకుని పేర్లు మారుస్తున్నాడని మండిపడ్డారు.