ముఖ్యమంత్రి కేటీఆర్!
మీడియా సమావేశంలో పొరబడ్డ మంత్రి జూపల్లి
మంత్రి పదవి ఊడటం ఖాయం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 18): సీఎం రేవంత్ రెడ్డి పేరును రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మర్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీలను అమలు చేస్తోందన్నారు. వాటికోసం నెలకు రూ.6500 కోట్లు ఖర్చు చేస్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనబోయి.. ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ మాట జారారు. వెంటనే దాన్ని సవరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే జూపల్లి వ్యాఖ్యలు అప్పటికే వైరల్ అయ్యాయి. మంత్రి జూపల్లి తనను ముఖ్యమంత్రి అనడంపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. మీరు చేసిన ఈ తప్పునకు త్వరలోనే మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయం’’ అంటూ తన సోషల్ మీడియా ఖాతా అయిన ఎక్స్ వేదికగా సదరు వీడియోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు.