నిరాడంబరుడికి నిలువెత్తు అవమానం.. !


Published Feb 21, 2025 01:52:56 PM
postImages/2025-02-21/1740126176_ed4c1e96680e4eafb4c49b4350bcf57e.jpeg

నిరాడంబరుడికి
నిలువెత్తు అవమానం 
గుమ్మడి నర్సయ్యను అవమానించిన రేవంత్
గంటల తరబడి వెయిట్ చేసిన నో అపాయింట్‌మెంట్ 
ఇంటికి వెళ్లినా, సెక్రటేరియట్‌కు వెళ్లిన దొరకని సీఎం
కుదరదని చెప్పి పంపేస్తున్న సిబ్బంది
రైత సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే
రేవంత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా
ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన నాకే సీఎం దొరక్కపోతే ఎలా?
తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కమ్యునిస్ట్ నేత

 గుమ్మడి నర్సయ్య.. ఐదు సార్లు ఎమ్మెల్యే. అత్యంత నిరాడంబరుడిగా పేరున్న నాయకుడు. అసెంబ్లీకి కూడా ఆర్టీసీ బస్సులోనే వెళ్లిన కమ్యునిస్టు నేత. పేదలు, బడుగులు, ఆదివాసీ జనం పక్షాన కొట్లాడిన ఎర్ర జెండా యోధుడు. అంతటి నేతను రేవంత్ సర్కార్ ఘోరంగా అవమానించింది. ఏళ్లుగా ప్రజా ఉద్యమంలో ఉన్న పెద్దాయన్ను.. సెక్రటేరియట్‌లోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంది. కమ్యునిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్.. ఇప్పుడా ఆ పార్టీ నాయకులనే అవమానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.     

తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 20): ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) నాయకుడు గుమ్మడి నర్సయ్యకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం  తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంటికి వెళ్లినా, సెక్రటేరియట్‌కు వెళ్లినా తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని నర్సయ్య వాపోయారు. నియోజకవర్గ సమస్యలపై, రైతులకు రుణమాఫీపై, రైతు భరోసాపై వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని కలవడానికి ఇప్పటికి నాలుగు సార్లు ప్రయత్నం చేశానన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నానన్నారు. 

ఐదు సార్లు ఎమ్మెల్యేనైనా తనకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జైపాల్ రెడ్డి, దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారని, తాను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడొచ్చినా ఫోన్లు చేస్తూ, మెసేజ్ పెడుతున్నా వాళ్లు మాత్రం సమాధానం ఇవ్వడం లేదని వాపోయారు. సెక్రటేరియట్‌కి డైరెక్టుగా పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుందని అన్నారు. గురువారం సెక్రటేరియట్ వద్దకి వెళ్ళగానే అక్కడున్న అధికారి.. పైఅధికారులకు ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వచ్చారని చెప్తే అపాయింట్మెంట్ కుదరదని చెప్పారని అన్నారు. ఈ గవర్నమెంటు, ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పని చేస్తున్నారని, ఎవరికి సేవ చేస్తున్నాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తమ లాంటి వాళ్ల నుంచి అభ్యర్థనలు తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుందని, తమ అనుభవాలు చెప్తాం అన్నారు..

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress former

Related Articles