హత్యా రాజకీయం!


Published Feb 21, 2025 01:34:13 PM
postImages/2025-02-21/1740125053_.jpeg

హత్యా రాజకీయం!

పొలిటికల్ టర్న్ తీసుకున్న 
రాజలింగమూర్తి మర్డర్ కేసు!
భూతగాదాలే కారణమన్న కుటుంబ సభ్యులు 
రేణిగుంట ఫ్యామిలీపై పోలీసులు కేసు నమోదు
హత్యపై సడన్ గా సీఎం రేవంత్ సీరియస్
దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశం
వెంటనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు, మంత్రులు
బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు షురూ
కేసీఆర్, హరీశ్, గండ్రపై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు
తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర
రాజలింగంతో హంతకులకు తగాదాలున్నాయన్న డీఎస్పీ 
సాయంత్రానికి బీఆర్ఎస్ నేతలపై మృతుడి భార్య సరళ ఆరోపణ


 జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పూర్తిగా రాజకీరంగు పులుముకుంటుంది. ఓపక్కన భూవివాదాలే హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఫిర్యాదులు.. మరోపక్కన రాజకీయ నాయకుల ఆరోపణలు కాకపుట్టిస్తున్నాయి.  

తెలంగాణం, స్టేట్ బ్యూరో(ఫిబ్రవరి 20): జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రాజలింగమూర్తి హత్య రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. వివరాల్లోకి వెళితే బుధవారం స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి రాజలింగమూర్తి వెళ్లారు. ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం కార్యాలయం ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఆయనను చుట్టుముట్టి, కత్తులు, గొడ్డళ్లతో నరికారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. హత్య జరిగిన రోజు రాత్రి భూతగాదాలే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల వ్యాఖ్యలతో కేసు కొత్త మలుపు తీసుకుంది. రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారులను ఆరా తీశారు. మర్డర్‌కు గల కారణాలపై నిఘా వర్గాల నుంచి సమాచారం కోరారు. 

ఇదిలా ఉంటే, రాజలింగమూర్తి హత్య కేసులో ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సంపత్ రావు తెలిపారు. ఈ హత్యపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ కస్టడీలోకి తీసుకోలేదని ఆయన అన్నారు. హత్య వెనుక ఉన్న ఎవరినీ వదిలి పెట్టేది లేదని తెలిపారు. రాజలింగమూర్తితో హంతకులకు భూతగాదాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 

సీబీ సీఐడీ వేయాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ 

రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ..  బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో హత్యా రాజకీయాలను పెంచి పోషించిందన్నారు. గాంధీభవన్‌లో గురువారం మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించిన రాజలింగాన్ని హత్య చేశారని సంచలన ఆరోపణ చేశారు. రాజలింగ మూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ తో పాటు ఐదుగురిపై రాజలింగం కోర్టులో కేసు వేశాడని, ఈ హత్యను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేయించారని, కేసీఆర్‌కు దోషిగా శిక్ష పడుతుందని హత్య చేయించారని రాజలింగమూర్తి కూతురు, భార్య చెప్తుందన్నారు. దీనిమీద సీబీసీఐడీ వేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లక్ష్యం ఒక్కటేనని, తెలంగాణలో అభివృద్ధి జరగొద్దన్నట్టుగా వ్యవహరిస్తోందన్నారు. సీబీ సీఐడీ విచారణ చేసి 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి వెంటనే శిక్ష వేయాలని మంత్రి అన్నారు. హత్యను సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్‌గా తీసుకుంటారని చెప్పారు.


హత్యతో నాకు సంబంధం లేదు : గండ్ర 

సామాజిక కార్యకర్త రామలింగ మూర్తి హత్యకు భూవివాదాలే కారణమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన ఆయన.. తనతో పాటు కేసీఆర్, హరీశ్ రావుపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను చంపించానని మంత్రి కోమటిరెడ్డి అంటున్నారు. ఏ ఆధారంతో ఈ ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హత్యారాజకీయాలను ప్రోత్సహించదన్నారు. కాళేశ్వరం కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. బట్ట కాల్చి పడేసినట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లోతుగా అధ్యయనం చేయాలని మంత్రి అంటున్నారని, సీబీ సీఐడీ కాకపోయినా, సీబీఐతో ఎంక్వైరీ చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. రాజకీయ రంగు పులుముతున్నారని అధికార పార్టీపై విమర్శలు చేశారు. రామలింగ మూర్తిని హత్య చేశారని పోలీసులకు ఆయన భార్య ఫిర్యాదు చేసిందని, దాని ఆధారంగానే నిందితులను పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. పోలీసుల దగ్గర నిందితులు ఉన్నారని సమాచారం ఉందన్నారు. దానికి సంబంధించిన విషయాలు తెలిశాక.. హత్యాకోణాన్ని కేసీఆర్, హరీశ్ రావు, తనపై చుట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాళేశ్వరంపై రామలింగ మూర్తి కేసు వేశారని, దీంతో తామే హత్య చేశామని ఆరోపిస్తున్నారన్నారు. కోమటిరెడ్డి నోటికి మొక్కాలని ఎద్దేవా చేశారు. రామలింగ మూర్తి హత్యతో తనకు, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రామలింగ మూర్తిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గతంలో ఒక హత్య చేయించాడని ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా చేశారని ఎద్దేవా చేశారు. 

మా అన్నకు 20 మంది శత్రువులు ఉన్నారు

మృతుడు రాజలింగంకు 20 మంది దాకా శత్రువులు ఉన్నారని ఆయన సోదరుడు మీడియాతో చెప్పారు. అందరూ కలిసే మా అన్నను అంతమొందించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి రౌడీలు వచ్చి మా అన్నను చంపారని చెప్పారు.

బీఆర్ఎస్ నేతలపై రాజలింగం భార్య ఆరోపణలు

హత్య వెనుక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గురువారం సాయంత్రం రాజలింగమూర్తి సరళ మాట్లాడుతూ గండ్ర వెంకటరమణ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో గండ్ర వెంకటరమణ రెడ్డి, సంజీవ, ఇంకొందరు వ్యక్తులతో తన భర్తను చంపించారని ఆరోపించాడు. అక్రమాలపై తన భర్త కేసు వేసినందుకే చంపించారని రాజలింగమూర్తి భార్య ఆరోపించారు.

అయితే మృతుడు రాజలింగం గురించి స్థానికంగా విచారించగా కొన్ని ఆరోపణలు వినిపించాయి. రాజలింగం చాలా భూ వివాదాస్పద కేసుల్లో ఉన్నారని , గతంలో కొంతమందితో ఇలాంటి భూవివాద కేసుల్లో కూడా ఉన్నారని తెలిసింది.

newsline-whatsapp-channel
Tags : kcr revanth-reddy politics police harish-rao

Related Articles