IRCTC: మహాశివరాత్రికి IRCTC గ్రేట్ టూర్ ప్లాన్ !

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్దిరిపోయే ప్యాకేజ్ తీసుకొచ్చింది. 


Published Feb 20, 2025 09:14:00 PM
postImages/2025-02-20/1740066339_Untitleddesign20231028T133404918.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మరికొన్ని రోజుల్లో శివరాత్రి వస్తుంది. ఈ పర్వదినానికి చాలా మంది శైవక్షేత్రాలు దర్శించాలనుకుంటారు. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండింటిని ఒకే ట్రిప్ లో దర్శించుకునేందుకు వీలుగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్దిరిపోయే ప్యాకేజ్ తీసుకొచ్చింది. 


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహా కాళేశ్వరుని ఆలయం, ఓంకారేశ్వర ఆలయాలు సహా మరికొన్ని దేవాలయాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించుకునేందుకు వీలుగా ఐఆర్​సీటీసీ 'మధ్యప్రదేశ్‌ జ్యోతిర్లింగ దర్శన్‌' పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ లో మొత్తం 5 రాత్రులు , 6 రోజులుగా ఉంటుంది. టూర్ ప్రకటించిన తేదీల్లో ప్రతి బుధవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ ట్రైన్ జర్నీ ద్వారా ఈ టూర్ ను నడిపిస్తున్నారు.


* మొదటి రోజు సాయంత్రం 4:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్​ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు (ట్రైన్‌ నెం.12707) బయల్దేరుతుంది. 


* అనంతరం భోజేశ్వర్​ మహాదేవ్​ టెంపుల్​ను దర్శించుకుని తిరిగి భోపాల్‌ చేరుకుంటారు. సాయంత్రం ట్రైబల్‌ మ్యూజియం విజిట్​ చేసి ఆ రాత్రికి భోపాల్‌లోనే స్టే చేస్తారు.


* మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఉజ్జయిని బయల్దేతారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత ఉజ్జయిని లోని శ్రీమహాకాళేశ్వర ఆలయం , హరసిధ్ది ఆలయం మంగళనాథ్ ఆలయం , నవగ్రహ శని మందిరం , శ్రీ చింతామన్ గణేష్ ఆలయం , రామ్ ఘూట్ ,శ్రీ గఢ్కాళికా ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రి ఉజ్జయినిలోనే బస ఉంటుంది.


* కోట, నర్మదా ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి ఓంకారేశ్వర్​కు బయలుదేరుతారు. అక్కడ ఓంకారేశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటారు.

 
* లాల్​బాగ్​ ప్యాలెస్​, గణేష్​ మందిరాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఇందౌర్​ రైల్వే స్టేషన్​లో డ్రాప్​ చేస్తారు. 


కంఫర్ట్‌లో సింగిల్ షేరింగ్​కి రూ.36,190, ట్విన్ షేరింగ్‌కు రూ.20,360, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.15,880 చెల్లించాలి. విత్ బెడ్‌తో రూ.9,500, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 7,600 చెల్లించాలి. డబుల్ షేరింగ్ లో 14220 , ట్రిపుల్ షేరింగ్ కు రూ. 11,820 అవుతుంది. ఇక అక్కడ చిన్న చిన్నవి చూడాలంటే జనాలని బట్టి వెహికల్ రేటు పడుతుంది. ఇవి కేవలం ట్రైన్ ఖర్చులు ...హోటల్ బిల్స్ మాత్రమే.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu railway-department shivalayam

Related Articles