Rekha Gupta: ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా...మధ్యాహ్నమే ప్రమాణస్వీకారం !

అయితే రేఖాగుప్తా గతంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆమె ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీ లో చదువుకున్నారు.


Published Feb 20, 2025 01:27:04 AM
postImages/2025-02-20/1740036310_vp9vb468rekhagupta650x40019February25.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న ఉత్కంఠకు బీజేపీ హైకమాండ్ తెరదించింది. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా పేరును ఖరారు చేశారు. రేఖాగుప్తా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే రేఖాగుప్తా గతంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆమె ప్రఖ్యాత ఢిల్లీ యూనివర్సిటీ లో చదువుకున్నారు.


అయితే ఒక టైంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ సీఎం రేసులో ముందున్నారంటూ వార్తలు వినిపించాయి. ఆల్ ఆఫ్ సడన్ రేఖా గుప్త తెరపైకి వచ్చారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు తెలిపారు. ఇక కేజ్రీవాల్ ను మట్టికరిపించడం తో పెను సంచలనం క్రియేట్ చేసిన పర్వేశ్ వర్శను డిప్యూటీ సీఎం పదవి వరించింది. స్పీకర్ గా విజయేంద్రగుప్తాను ఎంపిక చేశారు. రేపు సీఎంతో పాటు ఆరుగురు క్యాబినేట్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.


27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 12.35 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని తెలుస్తుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu politics delhi rekha-gupta next-cm

Related Articles