ఈ షాప్ ఓపెనింగ్ కు రాజమౌళి ఫ్యామిలీ తో పాటు ...రానా , ఫరియా అబ్దుల్లా , సీరత్ కపూర్ ..ఇలా చాలా మంది సెలబ్రెటీస్ వచ్చారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : రానా భార్య మిహిక రీసెంట్ గా ఫుడ్ స్టోరీస్ అనే ఫ్రాంఛైజ్ బిజినెస్ ను స్టార్ట్ చేశారు. ఈ షాప్ ఓపెనింగ్ కు రాజమౌళి ఫ్యామిలీ తో పాటు ...రానా , ఫరియా అబ్దుల్లా , సీరత్ కపూర్ ..ఇలా చాలా మంది సెలబ్రెటీస్ వచ్చారు. ఈ షాపులో ప్రపంచదేశాల్లో దొరికే ఫుడ్స్ , పండ్లు , కూరగాయలు కూడా దొరుకుతాయి. విదేశీ పండ్లు , కూరగాయలు , చేపలు , మాంసాహారాలు , మష్రూమ్ , చాక్లెట్స్ , స్వీట్స్ , మసాలాలు చాలా రకాల వాటర్ బాటిల్స్ ఉన్నాయి.
ఇక్కడ ఎక్కువగా వేరే దేశాల్లో దొరికే ఫుడ్ దొరుకుతుంది. దీంతో కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఆరు కేజీలు ఉండే రెషీ మష్రూమ్ ఏకంగా ఐదు లక్షలరూపాయిలు . దీంతో ఈ ధర చూసి షాక్ అవుతున్నారు. ఈ మష్రూమ్ చైనా , జపాన్ లోని కొన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది. అక్కడ గ్రాముల్లో అమ్ముతూ ఉంటారు. కేవలం 20 గ్రాముల రెషీ మష్రూమ్ దాదాపు వెయ్యి రూపాయిల పైనే ఉంటుంది. అంత కాస్ట్లీ . రానా వైఫ్ ఫుడ్ స్టోరీస్ లో దొరుకుతుంది.
ఇక్కడ థాయ్ లాండ్ కి చెందిన ప్రత్యేక కొబ్బరి బోండాలు దొరుకుతున్నాయి. ఆ బొండాం ధర ఒక్కోటి వెయ్యి రూపాయలు. ఆ నీళ్లు చాలా తియ్యగా ఉంటాయట. ఈ రేట్లు తెలుసుకున్న నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. కాఫీ ...అయితే వెయ్యి ఫ్లేవర్లు పైగా ఉన్నాయట. కాని జేబు ఫుల్ గా ఉంటేనే వెళ్లాలంటున్నారు నెటిజన్లు.