ఏపీకి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం, కోస్తాంధ్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తారమైన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. 


Published Jun 15, 2026 06:34:37 PM
postImages/2026-06-15/1781528677_RainAlert1024x576.jpg


ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం, కోస్తాంధ్ర తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన విస్తారమైన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. వర్షాల సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందట. మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే తీవ్ర అవకాశం ఉందని చెప్పారు. దీంతో సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. విజయనగరం, అరకు, మాడుగుల, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.పిడుగుపాటు ప్రమాదం ఉన్నందున చెట్ల కింద గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ నిలిచి ఉండటం ప్రాణాంతకరమని హెచ్చరించారు. బయట తిరిగేటప్పుడు విద్యుత్ లైన్లు, కరెంట్ స్తంభాలు, ఐరన్ హోర్డింగ్స్‌కు దూరంగా ఉండాలని చెప్పారు.
 

newsline-whatsapp-channel
Tags : ap-news weather-report weather-update rain-alert ap-rains thunder-storms

Related Articles