నోరు విప్పితే వాళ్లు అనుకున్నది తెలుగులో చెప్పలేరు.. చెప్పినా పక్కవాళ్లకి అర్ధం కాదు ..అలాంటి వాళ్లని ఎందుకు డబ్బులిచ్చి బిగ్ బాస్ లో పెట్టుకుంటున్నారో వాళ్లకే తెలియాలి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: తెలుగు బిగ్ బాస్ ...8 లో ఆల్ మోస్ట్ చాలా వరకు కన్నడవాళ్లు..హిందీ వాళ్లే ..మరి తెలుగు బిగ్ బాస్ ఎందుకో అర్ధం కావడం లేదు. కానీ నోరు విప్పితే వాళ్లు అనుకున్నది తెలుగులో చెప్పలేరు.. చెప్పినా పక్కవాళ్లకి అర్ధం కాదు ..అలాంటి వాళ్లని ఎందుకు డబ్బులిచ్చి బిగ్ బాస్ లో పెట్టుకుంటున్నారో వాళ్లకే తెలియాలి.
పోనీలే గ్లామర్ అయినా ఉందంటే....లాజిక్ లేకుండా ప్రేరణ, యష్మి చేస్తున్న గలాట, ఆడుతున్న ఆట అర్థంపర్థం లేకుండాపోతోంది. యష్మి ని చూస్తే భయమేస్తుంది సార్..ఆ పిల్ల కారణం లేకుండా గొడవ పడుతుంది. పోనీ తెలుగు పిల్ల సోనియా ఉందిలే అంటే ...ఆ పిల్లకి నిఖిల్ తో అభయ్ తో ..పృథ్వీ రాజ్ తో పులిహార కలిపేసరికి సరిపోతుంది. మన విష్ణుప్రియ ఆటలో అరటిపండు..మాటల్లో కాని ఆటల్లో కాని మెచ్యూరిటీ లేదు. ఏది ఏమైనా శక్తీ టీమ్ తమ ఆట ఆడుతూ గెలుపు దిశగా వెళ్తున్నారు. అభయ్ అంటారా ఈ వారం ఆ సారు బయటకే వచ్చేసేలా ఉన్నారు.
బిగ్ బస్ తెలుగు సీజన్ 8లో టాస్కుల రచ్చ కొనసాగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా బెంగళూరు బ్యూటీస్ రౌడీయిజం మరీ ఎక్కువైపోయింది. లాజిక్ లేకుండా ప్రేరణ, యష్మి చేస్తున్న గలాట, ఆడుతున్న ఆట అర్థంపర్థం లేకుండాపోతోంది. పాపం నిఖిల్ మాత్రం ఏదో ట్రై చేస్తున్నాడు. చూద్దాం వైల్డ్ కార్డులైనా తెలుగు వాళ్లు వస్తారో లేదో .