Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం !

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్ నాథ్ షిండే , ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్  డిప్యూటీ సీఎం గా ప్రమాణం స్వీకారం చేశారు


Published Dec 05, 2024 07:49:00 PM
postImages/2024-12-05/1733408413_690uiqrodevendrafadnavis160x12023November24.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్ నాథ్ షిండే , ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్  డిప్యూటీ సీఎం గా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో గవర్నర్ సీపీ రాధాకృష్ణణ్ ప్రమాణస్వీకారం చేయించారు. అయితే ఫడ్నవీస్ ఇది మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం చంద్రబాబు, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది సీఎంలు హాజరయ్యారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bjp maharastra byelections

Related Articles