కుంభమేళా సక్రమంగా జరిగితే ప్రపంచంలో ఎలాంటి యుధ్ధాలు...వ్యాధులు ...ప్రబలవని పురాణాలు చెబుతున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మహా కుంభమేళా ప్రారంభం అవ్వడానికి చాలా తక్కువ సమయమే ఉంది. ఈ కుంభమేళా 45 రోజుల పాటు జరుగుతుంది . అయితే ఈ కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతుంది. అయితే క్షీర సాగర మథనం జరిగినపుడు అప్పుడు ఉధ్భవించిన అమృతం లో నాలుగు చుక్కలు ఈ సమయంలో పుణ్యనదుల్లో పడ్డాయని అందులో కొన్ని యేళ్లకు ఓ సారి ఆ అధ్భుతఘట్టానికి ఉండే శక్తి ప్రతి కుంభమేళాకు నదుల్లో చేరుతుందని ఓ నమ్మకం. అంతేకాదు కుంభమేళా సక్రమంగా జరిగితే ప్రపంచంలో ఎలాంటి యుధ్ధాలు...వ్యాధులు ...ప్రబలవని పురాణాలు చెబుతున్నాయి.
కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు, కానీ మహా కుంభమేళా ను 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మహా కుంభమేళా అనేది ప్రారంభమవుతుంది. అంతేకాదు భూమి మీద ఒక్క ఏడాది అయితే దేవతలకు ఒక రోజు ..అది హిందూ గ్రంధాలే చెబుతున్నాయి. ప్రయాగ్రాజ్ లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం కావడం తో మహా కుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు.
ప్రయాగ్రాజ్ కాకుండా హరిద్వార్ లోని గంగా నది, నాసిక్ లోని గోదావరి నది, ఉజ్జయినిలోని సిప్రా నదిలో కూడా కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. కుంభమేళా సమయంలో ఆ నదుల్లో పుణ్యస్నానం చేయడం వలన మోక్షాన్ని పొందవచ్చు అని హిందువులు నమ్ముతారు. ఈ జనవరి 13 వ తేదీన మొదటి రాచస్నానం చేస్తారు. జనవరి 14న రెండో రాచస్నానం , మూడో స్నానం జనవరి 29వ తేదీన 4 వ స్నానం ఫిబ్రవరి 12వ తేదీన 5వ మరియు చివరిగా ఆరవ రాచస్నానం కుంభమేళా ముగిసిన రోజున అంటే ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజున నిర్వహించడం జరుగుతుంది.