ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో కొత్త ప్రాజెక్ట్ ఏది అనౌన్స్ చేయలేదు.. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే విజయ్ దేవరకొండ తో చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా బెడిసి కొట్టడంతో
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో కొత్త ప్రాజెక్ట్ ఏది అనౌన్స్ చేయలేదు.. ఇక ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యనే విజయ్ దేవరకొండ తో చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా బెడిసి కొట్టడంతో మృణాల్ ఠాకూర్ కాస్త వెనకడుగు వేసింది.
అప్పటివరకు రెండు సినిమాలతో స్టార్డం ని చూపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అస్సలు సైలెంట్ అవ్వలేదు. వెరైటీ వెరైటీ డ్రెస్ లతో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ అవకాశాల కోసం ఎంతో వెంపర్లు పడుతుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది.
ఇక ఆ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ మృణాల్ పక్కన ఉన్న ఆ మిస్టరీ మెన్ ఎవరా అని తెలుసుకునే పనిలో పడ్డారు. మరి ఇంతకీ మృణాల్ ఠాకూర్ పెట్టిన పోస్ట్ ఏంటా అనుకుంటున్నారా.. మృణాల్ ఠాగూర్ అవినాష్ అనే వ్యక్తితో దిగిన ఫోటో ని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే అమేజింగ్ పర్సన్.. నీ బర్త్డే చేయడం కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. రేపు చెన్నైలో కలుద్దాం అంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది.
అయితే ఈ పోస్టు క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ మృణాల్ ఠాకూర్ పక్కన ఉన్న ఆ మిస్టరీ మ్యాన్ ఎవరబ్బా అని తెలుసుకునే పనిలో పడ్డారు.ఇక ఆయన ఎవరో మృణాల్ ఠాకూర్ బయట పెడితే కానీ తెలియదు.