Nagarjuna: కొండా సురేఖను కోలుకోలేని దెబ్బ కొట్టిన నాగార్జున..?

గత 24 గంటల నుండి కొండా సురేఖ మాట్లాడిన మాటలు ఆమెపై సెలబ్రిటీలు రాజకీయ నాయకులు నిప్పులు చెరుగుతున్న కామెంట్లు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓవైపు  ఈమె మాటల వల్ల


Published Oct 03, 2024 06:07:40 PM
postImages/2024-10-03/1727959060_nagsurekha.jpg

న్యూస్ లైన్ డెస్క్: గత 24 గంటల నుండి కొండా సురేఖ మాట్లాడిన మాటలు ఆమెపై సెలబ్రిటీలు రాజకీయ నాయకులు నిప్పులు చెరుగుతున్న కామెంట్లు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓవైపు  ఈమె మాటల వల్ల ఇబ్బంది పడ్డ నాగార్జున, అమల,సమంత, నాగచైతన్య, కేటీఆర్ లు స్పందించారు. మరోవైపు సినీ ఇండస్ట్రీ మొత్తం సమంత కి అక్కినేని ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలుస్తూ సురేఖ మాటలని కొట్టి పారేస్తున్నారు.

అయితే తాజాగా నాగార్జున చేసిన పనికి సురేఖకి గట్టి షాక్ తగిలింది. ఈ విషయంలో నాగార్జున సురేఖకి ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ కొట్టాడు రా అంటూ చాలామంది అక్కినేని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ నాగార్జున చేసిన పనేంటయ్యా అంటే..కొండా సురేఖ మాట్లాడిన మాటలపై తమ పరువుకు భంగం కలగడంతో కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేశారు.

అవును మీరు వినేది నిజమే.. ఏదైనా సరే లీగల్ గా పోవాలి అనే ఉద్దేశంతో నాగార్జున నాంపల్లి కోర్ట్ లో కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసినట్టు తెలుస్తోంది. సమాజంలో తమ పరువు మర్యాదలకు భంగం కలిగించిన కొండా సురేఖ మాటలని తీవ్రంగా ఖండిస్తూ నాగార్జున కొండా సురేఖ పై లీగల్ గా యాక్షన్ తీసుకోవాలని క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేయడంతో కొండా సురేఖకి గట్టి షాక్ తగిలింది.

దీంతో ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ నాయకులతో పాటు చాలామంది అక్కినేని ఫ్యాన్స్ సమంత ఫ్యాన్స్ అక్కినేని నాగార్జున కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అంతేకాదు కొండా సురేఖకి కోలుకోలేని దెబ్బ కొట్టారు అంటూ కామెంట్లు పెడుతున్నారు

newsline-whatsapp-channel
Tags : news-line ktr nagarjuna samantha naga-chaithanya konda-surekha

Related Articles