Anshumalika: రోజా కూతురు అన్షు మాలిక అవార్డు !

నమీబియా, నైజీరి­యా, భారత్‌.. లాంటి దేశాల్లో వెనుకబడిన వర్గా­ల్లో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్‌ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళల­కు వెబ్‌ డె­వలప్‌మెంట్‌ శిక్షణ ఇవ్వడం, సోషల్ మీడియా ద్వా­రా పేదవ­ర్గాలకు సాంకేతిక విద్యను అందించడం.. ఇలాంటి అంశాలపై పరిశోధన, వాటి కోసం పనిచేసిన అంశంలో అన్షుకి ఈ అవార్డు­ను ప్రకటించినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి


Published Sep 19, 2025 11:12:00 AM
postImages/2025-09-19/1758260654_hq720.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ యాక్టర్ రోజా కూతురు అన్షు మాలిక అవార్డు అందుకుంది. అయితే రోజా కూతురు అన్షు ప్రముఖ రచయిత్రి ..పుస్తకాలు కూడా రాసింది. చాలా సేవాకార్యక్రమాలు కూడా చేసింది. అన్షు ప్రస్తుతం అమెరికా లో చదువుకుంటుంది. అక్కడ చదువుకుంటూనే సేవాకార్యక్రమాలు చేస్తుంది. అమెరికా బ్లూమింగ్‌టన్‌లోని ఇండియానా వర్సిటీలో రోజా కూతురు అన్షు మాలిక బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ కంప్యూ­టర్స్‌ చదువుతుంది. తాజాగా అన్షు ప్రతిష్టాత్మకమైన మౌరీన్‌ బిగ్గర్స్‌ అవార్డు 2025–26 అందుకుంది.

ఈక్విటీ ని ప్రోత్సహిస్తున్న అన్షు లాంటి ప్రతి యేడాది అవార్డులు ఇస్తారు. ఈ యేడాది ఆ అవార్డు అన్షును వరించింది. నమీబియా, నైజీరి­యా, భారత్‌.. లాంటి దేశాల్లో వెనుకబడిన వర్గా­ల్లో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్‌ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళల­కు వెబ్‌ డె­వలప్‌మెంట్‌ శిక్షణ ఇవ్వడం, సోషల్ మీడియా ద్వా­రా పేదవ­ర్గాలకు సాంకేతిక విద్యను అందించడం.. ఇలాంటి అంశాలపై పరిశోధన, వాటి కోసం పనిచేసిన అంశంలో అన్షుకి ఈ అవార్డు­ను ప్రకటించినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.  అయితే ఈ విషయాన్ని అన్షు తన సోషల్ మీడియాలో అమెరికన్ మీడియా తన గురించి ఓ ఆర్టికల్ రాసిందని తెలిపింది. దీంతో అన్షుకు రోజా అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu roja america daughter awards

Related Articles