ఎప్పుడు పెళ్లిలో సీజన్ వచ్చినా బరాత్ లో తప్పకుండా ఈ పాట ఉండాల్సిందే. పాటకు వధూవరులిద్దరు స్టెప్పులు వేయాల్సిందే. ఈ పాట రియల్ గా పాడి డాన్స్ చేసిన మోహన భోగరాజుకు అంతగా పేరు
న్యూస్ లైన్ డెస్క్: ఎప్పుడు పెళ్లిలో సీజన్ వచ్చినా బరాత్ లో తప్పకుండా ఈ పాట ఉండాల్సిందే. పాటకు వధూవరులిద్దరు స్టెప్పులు వేయాల్సిందే. ఈ పాట రియల్ గా పాడి డాన్స్ చేసిన మోహన భోగరాజుకు అంతగా పేరు రాలేదు కానీ ఈ పాటపై స్టెప్పులు వేసిన పెళ్లికూతురులు చాలా వైరల్ అయ్యారు. ఇప్పటికే ఎన్ని పెళ్లి బరత్ లు జరిగినా అందులో పెళ్లికూతురు తప్పకుండా బుల్లెట్ బండి సాంగ్ పై డాన్స్ చేస్తూ ఉంటారు. అలా ఈ సాంగ్ విపరీతంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా వైరల్ అయిపోయింది.
ప్రతి పెళ్లిఘట్టంలో ఈ పాట కీలకమైంది. సాధారణంగా పెళ్లి తంతు ముగిసిన తర్వాత చివరి ఘట్టమైన బరాత్ నిర్వహిస్తారు. చాలామంది పెళ్లికూతుర్లు బుల్లెట్ బండి సాంగ్ పై తప్పకుండా డ్యాన్స్ చేస్తున్నారు. అంతేకాదు ఆ డ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్ గా మారుతుంది. ఈ విధంగా ఎంతో సెన్సేషన్ అయినటువంటి బుల్లెట్ బండి సాంగ్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది.
https://www.instagram.com/reel/C_GK4VLM6VL/?igsh=MTQ4azNveHdqODJqaA==
పెళ్లి చేసుకున్నటువంటి ఒక వధువు తన భర్తతో "నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తాగా.. డుగ్గు డుగ్గు" అంటూ డాన్స్ చేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. అయితే ఈ డాన్స్ వీడియోను మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. వాస్తవానికి ఈ పాట రచయిత లక్ష్మణ్, ఈ పాటను పాడుతూ డాన్స్ చేసింది మోహన భోగరాజు. ఎస్ జె బాజీ సంగీతమందించారు. అలాంటి ఈ పాట సోషల్ మీడియాలో పెళ్లిళ్ల సీజన్ లో ప్రతిసారి వైరల్ అవుతుంది. అయితే తాజాగా సాయిశ్రీజా అనే పెళ్లికూతురు ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ అలరించింది దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.