PAK vs BAN : ఏంది రా సామి ఆసియా కప్ లో పాకిస్థాన్ స్కూల్ లెవెల్ ఫీల్డింగ్ !


బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో పాక్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మాద్ హారిస్ , మహ్మాద్ నవాజ్ రాణించారు.


Published Sep 26, 2025 11:44:00 AM
postImages/2025-09-26/1758867371_SaifHassansRunOutChance784x441.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ పాకిస్థాన్ ఫీల్డింగ్ కు యావత్త్ ప్రపంచం అవాక్కయిపోయింది. ఆసియాకప్ 2025 లో తప్పకగెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించింది. గురువారం దుబాయ్ వేదిక బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పాక్ ఫైనల్ కు అర్హత సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ తో పాక్ ఫైనల్ మ్యాచ్ కు రెడీ అవ్వనుంది.


బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో పాక్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మహ్మాద్ హారిస్ , మహ్మాద్ నవాజ్ రాణించారు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా , షాహీన్ అఫ్రిది పర్వాలేదనించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు . మెహేదీ హసన్ , రిషద్ హుస్సేన్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టాడు ముస్తాఫిజుర్ రెహ్మన్ ఓ వికెట్ సాదించాడు.


అనంత‌రం 136 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. బంగ్లా బ్యాట‌ర్ల‌లో షమీమ్ హుస్సేన్ రాణించాడు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. బంగ్లాబ్యాటర్ ను ఈజీగా రనౌట్ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. స్కూల్ స్థాయి ఫీల్డింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో జరిగింది. ఈ ఓవర్ షాహీన్ వేశాడు . ఫస్ట్ బాల్ తౌహిద్ హృదయ్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సైమ్ అయూబ్ డైవ్ చేసి బంతిని ఆపాడు. రన్ కోసం బంగ్లా బ్యాటర్లు ప్రయత్నించారు. ఈ లోగా పాక్ ఫీల్డర్ బంతిని ఆపడంతో బ్యాటర్లు చాలా కన్ఫ్యూజన్ కు గురయ్యారు. ఇద్దరు బ్యాటర్లు కూడా వికెట్ కీపర్ ఎండ్ వైపుకు పరిగెత్తారు. ఆయూబ్ నాన్  బాల్ ను ఆపి ..నాన్ స్టైకింగ్ ఎండ్ వికెట్ల వైపు బంతిని త్రో చేశాడు. అయితే నాన్ స్రైకింగ్ ఎండ్ లో ఏ ఒక్క పాక్ ఆటగాడు లేకపోవడంతో ఈజీగా రనౌట్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. మళ్లీ వాళ్లు బాల్ అందుకునేలోగా బంగ్లా బ్యాటర్ సైఫ్ హసన్ నాన్ స్టైకింగ్ ఎండ్ కు చేరుకున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : india bangladesh asia-cup pakistan cricket-player

Related Articles