Bhagyasri Borse:నేను చిన్నప్పుడు అలా ఉండేదాన్ని..?

మిస్టర్ బచ్చన్ సినిమా ఈరోజు రిలీజ్ అయి అద్భుతమైన టాక్స్ సొంతం చేసుకుంది. రవితేజ హీరోగా ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కథానాయకగా  భాగ్యశ్రీ నటించారు.


Published Aug 15, 2024 11:26:00 AM
postImages/2024-08-15/1723699504_bhagyasreeborse.jpg

న్యూస్ లైన్ డెస్క్: మిస్టర్ బచ్చన్ సినిమా ఈరోజు రిలీజ్ అయి అద్భుతమైన టాక్స్ సొంతం చేసుకుంది. రవితేజ హీరోగా ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కథానాయకగా  భాగ్యశ్రీ నటించారు. ఈమె నటన ఈ చిత్రానికే ఒక అద్భుతంగా చెప్పవచ్చు.  అలాంటి ఈ చిత్రంలో ఈమె నటన చూసిన చాలామంది నెటిజన్స్ ఆమె లుక్ కు మంత్రముగ్ధులయ్యారు. అంతేకాదు దర్శక, నిర్మాతలు కూడా ఆమె నటనని చూసి మంచి కామెంట్ ఇస్తున్నారట.

అంతేకాదు ఆమెకు ఈ సినిమా తర్వాత అనేక ఆఫర్లు వస్తాయని కూడా తెలుస్తోంది. అలాంటి భాగ్యశ్రీ   సినిమా రిలీజ్ కి ముందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. భాగ్యశ్రీ చిన్నతనంలో చాలా లావుగా ఉండేదట. ఓ వయస్సు దాకా అలాగే ఉందట.  దీంతో స్కూల్ టైంలో చాలామంది తనను హేళన చేసేవారట.

 కానీ వాళ్ల గెలి వల్ల ఎంతో బాధపడ్డ భాగ్యశ్రీ  ఎలాగైనా స్లిమ్ గా అవ్వాలని భావించి, ఎన్నో కాసరత్తులు  చేసి స్లిమ్ లుక్ సాధించిందట. దీంతో ఆమెకు సినిమాల్లో కూడా ఆఫర్స్ వచ్చాయి. వరుస చిత్రాల్లో దూసుకుపోతున్న భాగ్యశ్రీ  తాజాగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అంతే కాదు నన్ను హేళన చేసిన వారి ముందు నేను ఇప్పుడు ఒక మంచి బ్యూటీగా  హీరోయిన్ గా ఎదిగానని చెప్పకనే చెప్పేసింది. మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అయి హిట్టు టాక్ సొంతం చేసుకోవడంతో ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu raviteja harish-shankar mr-bachchan bagyasri-boorse

Related Articles