Vijay: చివరికి  కారును కూడా అమ్మే పరిస్థితికి దళపతి విజయ్..కారణం.!

తమిళ స్టార్  దళపతి విజయ్ అంటే కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా కన్నడ, తెలుగు, ఇండస్ట్రీలో కూడా ఎంతో సుపరిచితుడు. ఈయన ఏ చిత్రం చేసిన అది సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది.


Published Aug 03, 2024 07:42:46 PM
postImages/2024-08-03/1722694366_vijay.jpg

న్యూస్ లైన్ డెస్క్: తమిళ స్టార్  దళపతి విజయ్ అంటే కేవలం తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా కన్నడ, తెలుగు, ఇండస్ట్రీలో కూడా ఎంతో సుపరిచితుడు. ఈయన ఏ చిత్రం చేసిన అది సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది.  అలాంటి దళపతి విజయ్ సినిమా రంగంలో ఎంతో ఎదిగారు. ప్రస్తుత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ కూడా ఇద్దామని ట్రై చేస్తున్నారు.

ఇదే తరుణంలో విజయ్ కి  కొన్ని ఇబ్బందులు వస్తున్నాయట. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ లో చిక్కుకునే ఈయన తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారట. రీసెంట్ గా విజయ్ తన పొలిటికల్ పార్టీ ప్రకటించిన తరుణంలో  కొన్ని వివాదాలు బయటకు వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా తాను ఎంతో ఇష్టపడి ప్రేమతో కొన్నటువంటి ఫారిన్ కారుకు ఆయన టాక్స్ కట్టకపోవడంతో వివాదం మొదలైంది.

దీంతో కోర్టు మెట్లు ఎక్కవలసి వచ్చింది. చివరికి కోర్టులో న్యాయమూర్తులు మొట్టికాయలు వేసి  అలాంటి తప్పు చేయకూడదని వివరించారు.  ఆ కారుతో ఆయనకు అనేక వివాదాలు చుట్టుముడుతుండడంతో ఇక ఆ కారు వద్దనుకున్నాడట. తాను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి దాన్ని  అమ్మెయ్యబోతున్నాడని తెలుస్తోంది.  

అయితే దళపతి విజయ్ ఉపయోగించినటువంటి కారు అమ్మకానికి వచ్చిందంటూ రోల్స్ రాయిస్ కారు ఫోటోను ఎంపైర్ ఆటోస్ కార్ డీలర్ షిప్  తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అంతేకాకుండా దీని ధర 2.6 కోట్లని ఇది ఫిక్స్ రేట్ కాదని కొనే వారి పరిస్థితిని బట్టి రేటు మారుతుందని తెలియజేసింది. దీంతో విజయ్ కారు అమ్ముతున్నాడా అంటూ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu politics kollywood vijay-thalapathy car

Related Articles