Hanshita Reddy: హాట్ లుక్ లో దిల్ రాజ్ కూతురు.. వైరలవుతున్న ఫొటోస్.!

దిల్ రాజు పేరుతో తన కూతురు హన్షితా రెడ్డి కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ఈమె ప్రొడక్షన్లో ఇప్పటికే బలగం సినిమా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి దిల్ రాజు కూతురు ఒక్కసారిగా హాట్ లుక్ లో 


Published Jul 31, 2024 02:42:42 AM
postImages/2024-07-31/1722411747_hanshitha.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే తెలియని వారు ఉండరు. సక్సెస్ ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా ఎన్నో చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. అలాంటి దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీలోని టాప్ 10 నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. పెద్ద సినిమాలైనా సరే చిన్న సినిమాలయినా సరే దిల్ రాజు తప్పనిసరిగా నిర్మిస్తారు.  అంతే కాదు కొత్త డైరెక్టర్లు, కొత్త నిర్మాతలు, కొత్త నటీనటులకు ఛాన్స్ కూడా అందిస్తారు.

 అలాంటి దిల్ రాజు నిర్మాణంలో ఫిదా, దువ్వాడ జగన్నాథం,రౌడీ బాయ్స్, ఇద్దరి లోకం ఒకటే,  నేను లోకల్,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం, ఎవడు, రామ రామ కృష్ణ కృష్ణ, మిస్టర్ ఫర్ఫెక్ట్ ఇలా ఎన్నో చిత్రాలు వచ్చాయి. అలా దిల్ రాజు పేరుతో తన కూతురు హన్షితా రెడ్డి కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ఈమె ప్రొడక్షన్లో ఇప్పటికే బలగం సినిమా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

అలాంటి దిల్ రాజు కూతురు ఒక్కసారిగా హాట్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఈమె  తన హస్బెండ్ అర్చిత్ రెడ్డి పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సముద్రంలో బోటులో షికారు చేస్తూ కార్ రేసింగ్ లో పాల్గొంటూ పులితో దిగిన ఫోటోలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో ఫోటోలు తీయించుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

 ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు స్లిమ్ సూట్ లో హన్షిత రెడ్డి చాలా బాగుందని, ఈమె నుంచి ఇలాంటి లుక్ ఎప్పుడు చూడలేదని కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా ఓసారి చూసేయండి.

https://www.instagram.com/hanshithareddy/p/C9zSr7CJelw/?hl=en

newsline-whatsapp-channel
Tags : newslinetelugu dilraju hanshita-reddy balagam hanshitha-vacation-photos

Related Articles