Television: నగర వ్యాప్తంగా టీవీ ప్రసారాలు బంద్

నగర వ్యాప్తంగా మంగళవారం పలు ప్రాంతాల్లో టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది


Published Aug 06, 2024 06:44:22 AM
postImages/2024-08-06/1722944595_cabels.PNG

న్యూస్ లైన్ డెస్క్: నగర వ్యాప్తంగా మంగళవారం పలు ప్రాంతాల్లో టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలపై ఉన్న కెబుల్స్‌లను విద్యుత్ సిబ్బంది తొలగిస్తున్నారు. దీనితో పలు ప్రాంతాల్లో టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా వేసిన కేబుల్స్‌ను తొలగిస్తున్నామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్ లతో విద్యుత్ అధికారులు సమావేశమైయారు.

51 శాతం నిరుపయోగంగా ఉన్న కేబుల్స్ ఉన్నాయాని విద్యుత్ అధికారులు తెలిపారు. పర్మిషన్ లేకుండా కేబుల్స్ వేయడంతో విద్యుత్ స్తంభాలు వంగుతున్నాయి అని విద్యుత్ అధికారులు అంటున్నారు. పర్మిషన్ లేకుండా ఉన్న కేబుల్స్‌ను మాత్రమే తొలగిస్తున్నామని విద్యుత్ అధికారులు తెలిపారు. ఎవరైన పర్మిషన్ లేకండా కేబుల్స్‌లను పెట్టుకుంటే కఠిన చర్యలు ఉంటాయి అని విద్యుత్ అధికారులు స్పష్టం చేశారు.

newsline-whatsapp-channel
Tags : india-people electricy-bills

Related Articles