ఒక్కసారిగా వెలుగు సంభవించడంతో భయాందోళనతో ప్రజలు పురుగులు తీశారు. ఈ ప్రమాదంలో 16 మందికి పైగా కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో సెజ్‌లోని ఘోర ప్రమాదం జరిగింది. ఎసెన్సియా కెమికల్ కంపెనీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగలు అలుముకున్నాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం.
ఒక్కసారిగా వెలుగు సంభవించడంతో భయాందోళనతో ప్రజలు పురుగులు తీశారు. ఈ ప్రమాదంలో 16 మందికి పైగా కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో భారీ ప్రాణ నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మరికాసేపట్లో ఘటనా స్థలానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ వెళ్లి పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.