SRH vs RR: ఐపీఎల్‌ 2025లో మొట్టమొదటి సెంచరీ.. ఇషాన్ అద్దరగొట్టేస్తున్నాడు !

ఇషాన్ కిషన్‌, ట్రావిస్‌ హెడ్‌ ధాటిగా ఆడారు. ఇషాన్ కిషన్‌ 45 బంతుల్లో సెంచరీ బాదాడు


Published Mar 23, 2025 05:49:00 PM
postImages/2025-03-23/1742732417_CRICKETSRHRR4417427316060771742731625193.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ipl) 2025 లో భాగంగా ఈ రోజు హైదదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో 286/6 స్కోరు బాదింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోరు. ఇషాన్ కిషన్‌, ట్రావిస్‌ హెడ్‌ ధాటిగా ఆడారు. ఇషాన్ కిషన్‌ 45 బంతుల్లో సెంచరీ బాదాడు.
అభిషేక్ శర్మ 21(11 బంతులు , 5 ఫోర్లు) , ట్రావిస్ హెడ్ (31 బంతులు , 3 సిక్సులు ,9 ఫోర్లు) ఇక ఇషాన్ కిషన్ 106 నాటౌట్ (47 బంతులు, 6 సిక్సులు, 11 ఫోర్లు), అంకిత్ వర్మ 7 (3 బంతులు, ఒక సిక్స్‌) రన్స్‌ చేశారు. అభినవ్ మనోహర్ డకౌట్ కాగా, పాట్ కమ్మిన్స్‌ (0) నాటౌట్‌గా నిలిచాడు. హోం గ్రౌండ్ లో ఎస్ ఆర్ హెచ్ భారీ స్కోర్ నమోదు చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu cricket-news cricket-player

Related Articles