ఆ రోగికి సెంట్రల్ లైన్ ఇన్ఫెక్షన్స్ , మేజర్ సెంట్రల్ వెయిన్స్ థ్రాంబోసిస్ తో పదేపదే బాధపడ్డాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ హాస్పటిల్ లో వైద్యులు సక్సస్ ఫుల్ గా పేగు మార్పిడి ఆపరేషన్ చేశారు. తెలంగాణలో జరిగిన ఫస్ట్ పేగు మార్పిడి ఆపరేషన్ ఇదే కావడం విశేషం . షార్ట్ గట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 40 ఏళ్ల ఓ రోగి ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో చేరాడు. ఈ సిండ్రోమ్ తో బాధపడేవారికి పేరెంటల్ న్యూట్రిషన్ సపోర్ట్ చాలా అవసరం అంతేకాదు ఆ రోగికి సెంట్రల్ లైన్ ఇన్ఫెక్షన్స్ , మేజర్ సెంట్రల్ వెయిన్స్ థ్రాంబోసిస్ తో పదేపదే బాధపడ్డాడు.
అతనికి అక్యూట్ సుపీరియర్ మెసెంటెరిక్ ఆర్టరీ మూసుకుపోయిన కారణంగా పేగులు చాలా దారుణంగా దెబ్బతింటాయి. దీని వల్ల అతని చిన్న ప్రేగు, కుడి పెద్ద ప్రేగులో చాలా భాగాన్ని తొలంగించారు డాక్టర్లు. డ్యూడెనోజెజునల్ ఫ్లెక్చర్ నుంచి ఉండే ప్రాక్సిమల్ జెజునమ్‌లో 30 సెంటీమీటర్లు మాత్రమే బాగుంది. అయితే ఈ నెల 19 న ఉస్మానియా వైద్యులు కాడవెరిక్ చిన్న పేగు మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పుడు ఆ రోగి సాఫ్ట్ డైట్ ను తినగలుగుతాడు. అతడి ఇలియోస్టోమీ కూడా సరిగ్గా పనిచేస్తోంది. శస్త్రచికిత్స చేసిన తర్వాత ఏడో రోజు చెకప్ ప్రొసీజర్ (ఎండోస్కోపీ) చేశారు. ఆపరేషన్ చేసి మార్చిన ప్రేగు లోపల హెల్దీగా, నార్మల్ గా కనిపించింది. బయాప్సీ లో కూడా కొత్త పేగు చాలా హెల్దీగా కనిపించింది. అయితే ఇంత రేర్ కండిషన్ ఆపరేషన్ చెయ్యడం తెలంగాణలో ఇదే మొదటిసారి కావడం చాలా ఇంపార్టెంట్.