Asia Cup: యూఏఈపై భారత్ గ్రాండ్ విక్టరీ

మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్ మెగా టోర్నీ‌లో భాగంగా ఆదివారం డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ టీమిండియా వర్సెస్ యూఏఈ జట్ల మధ్య రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-21/1721563123_GTAmFnjWwAAVuf7.jpeg

న్యూస్ లైన్ స్పోర్ట్స్: మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్ మెగా టోర్నీ‌లో భాగంగా ఆదివారం డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ టీమిండియా వర్సెస్ యూఏఈ జట్ల మధ్య రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీతో చెరరేగగా.. రీచా గోష్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో యూఏఈ బౌలర్లకు చుక్కలు చూపించింది. దీంతో టీమిండియా, యూఏఈ జట్టుపై 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళ జట్టుకు ఓపెనర్లు మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ షఫాలీ వర్మ, స్మృతి మంధన ఇద్దరూ ధనాధన బ్యాటింగ్ చేస్తూ యూఏఈ బౌలర్లపై చెలరేగారు. ఈ జోడి భారత స్కోర్ బోర్డుకు 40 రన్స్ జతచేశారు. అయితే కవిషా ఎగోదాగే బౌలింగ్‌లో మంధన(13) భారీ ష్టార్ ఆడే ప్రయత్నంలో రినిత రజిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. ఈ తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్న షఫాలీ(37), ద‌య‌లాన్ హేమ‌ల‌త‌(2) వెనుదిరిగారు. దాంతో భారత టాప్ ఆర్డర్ మూడు వికెట్లు వద్ద 50 పరుగులకే కుప్పకూలింది. ఈ సమయంలో క్రీజులో దిగిన సారథి హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ దూకుడు బ్యాటింగ్ చేసింది. బౌండరీలు, సిక్సర్ బాదుతూ యూఏఈ బౌలర్లకు ఊచకోత చూపించింది. వేగంగా రన్స్ స్కోర్ చేస్తూ కౌర్( 47 బంతుల్లో 66 పరుగులు 7 ఫోర్లు, 1 సిక్సర్) సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. మరో ఎండ్‌లో జెమీమా రోడ్రిగ్స్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అయితే జెమీమా(14)ను కవిషా ఎగోదాగే బోల్తా కొట్టించింది. ఒక చక్కని బంతితో వికెట్ పడగొట్టింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రీచా గోష్ కెప్టెన్‌తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించింది. బౌండరీలు, సిక్సర్ కొడుతూ తన తుఫాన్ బ్యాటింగ్‌తో ( 29 బంతుల్లో 64 రన్స్ 12 ఫోర్లు, 1 సిక్సర్ల)తో ఫిఫ్టి పూర్తి చేసుకుంది.  ఈ జోడి 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు. ఇక చివరి వరకు క్రీజులో ఉండి భారత జట్టుకు భారీ స్కోర్‌ని అందించారు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు కొట్టింది. యూఏఈ బౌలర్లు  కవిషా ఎగోదాగే రెండు వికెట్లు పడగొట్టాగా.. సమైరా ధరణిధర్క, హీనా హాట్‌చందానీ చెరో వికెట్ తీశారు. 


భారీ లక్షాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన యూఏఈ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ తీర్థ సతీష్(4)ను రేణుకా సింగ్ వెనక్కి పంపింది. ఆ తర్వాత రినిత రజిత్(7), సమైరా ధరణిధర్క(5) పెవిలియన్ బాట పట్టారు. దాంతో యూఏఈ మూడు వికెట్లు కోల్పోయి 30 రన్స్ చేసింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన ఆల్‌రౌండర్ కవిషా ఎగోదాగే, కెప్టెన్ ఈషా రోహిత్ ఓజా‌తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇద్దరూ బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును ముందు నడిపించారు. జట్టు స్కోర్ బోర్డుకు 80 పరుగులు జోడిచించారు. అయితే ఈ జోడిని తనూజా కన్వర్ బ్రేక్ వేసింది. సూపర్ ఫాస్ట్ బౌలింగ్‌తో ఈషా(38) వికెట్‌ను పడగొట్టింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఖుషీ శర్మ(10), హీనా హాట్‌చందానీ(8), రితికా రజిత్(6) వరుసగా విఫలమైయ్యారు. ఇక అఖరి వరకు కవిషా ఒటరి పోరాటం చేసిన ఫలితాం దక్కలేదు. దీంతో భారత్, యూఏఈ జట్టుపై 78 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా బౌలర్లు దీప్తి శర్మ రెండు వికెట్ల పడగొట్టాగా.. పూజా వ‌స్త్రాక‌ర్, రాధా యాద‌వ్, రేణుకా సింగ్ తలా వికెట్ తీశారు. 

newsline-whatsapp-channel
Tags : india-people india-women won-the-match

Related Articles