ఇప్పుడు విడుదలైన ఫలితాలతో విద్యార్థులు తమ తాత్కాలిక మార్కుల మెమోను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్ధులకు గుడ్ న్యూస్ 2025 సంవత్సరానికి సంబంధించి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 16 వ తేదీ ఉదయం 12 గంటలకు విడుదల చేసింది. మొదటి మరియు రెండవ ఏడాది విద్యార్ధులు ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ అయిన tgbie.cgg.gov.in లేదా results.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి 29 వరకు నిర్వహించబడ్డాయి. ఇప్పుడు విడుదలైన ఫలితాలతో విద్యార్థులు తమ తాత్కాలిక మార్కుల మెమోను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రిజల్ట్ చెక్ చేయడానికి హాల్ టికెట్ నంబర్ , పుట్టిన తేదీ వివరాలు అవసరం . ఎవరైనా విద్యార్ధికి తన ఫలితాల్లో ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే బోర్డు అధికారులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఫలితాల విడుదలతో ఎంతో మంది విద్యార్ధుల విద్యామార్గం తేలనుంది. ఉత్తీర్ణులైన వారు తన విద్యను కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు రీచెకింగ్ లేదా తదుపరి పరీక్షల కోసం సిద్ధమవ్వాల్సి ఉంటుంది.