డిఫరెంట్ జానర్‌లో వస్తున్న ప్రభాస్ మూవీగా ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకున్న ‘ది రాజా సాబ్’ పై ఈ టీజర్ మరింత అంచనాలు పెంచేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా , మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ " ది రాజా సాబ్ " ఈ మూవీ డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమాకి సంబంధించి టీజర్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. హారర్ ఎలిమెంట్స్ పాటు ఫన్నీ డైలాగులు , ఆకట్టుకునే విజువల్స్ తో టీజర్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. డిఫరెంట్ జానర్‌లో వస్తున్న ప్రభాస్ మూవీగా ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకున్న ‘ది రాజా సాబ్’ పై ఈ టీజర్ మరింత అంచనాలు పెంచేసింది.