నాలుగు వికెట్లకు ..244 రన్స్ తో ఇండియా విజయం సాధించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పాకిస్థాన్ పై ఇండియా విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. కొహ్లీ 100 నాటౌట్ ... 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగు అయ్యాయి. పాకిస్తాన్ టోర్నీ నుంచి తొలగిపోయినట్లే.
శ్రేయస్ అయ్యర్ (56; 67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. శుభ్‌మన్ గిల్ (46; 52 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. రోహిత్ శర్మ (20) ఫర్వాలేదనిపించాడు. పాకిస్తాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది, ఖుష్‌దిల్ షా లు తలా ఓ వికెట్ సాధించారు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది.
.