Devara: చుట్టమల్లె సాంగ్ నుంచి జాన్వీ మేకింగ్ వీడియో

బుధవారం జాన్వీ కపూర్ ఈ సాంగ్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


Published Aug 07, 2024 10:34:13 AM
postImages/2024-08-07/1723043157_janvi.PNG

న్యూస్ లైన్ సినిమా: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, వసుధ ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేవర పార్ట్ -1 తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఆడియన్స్ ముందు రానుంది. ఆగస్టు 5న ఈ మూవీ నుంచి ‘‘చుట్టమల్లె’’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో టాప్ 1 ట్రెండింగ్‌లో నిలిచింది. 

ఈ పాటలో ఎన్టీఆర్ లుక్స్, జాన్వీ కపూర్ గ్లామర్ కిల్లింగ్ గా అనిపించింది. ఇద్దరి జోడీ మ్యూజిక్ కి తగినట్లు డ్యాన్స్ చేయడం పాటకు మరింత అందంగా అనిపించింది. బుధవారం జాన్వీ కపూర్ ఈ సాంగ్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో జాన్వీ అందాలతో  ప్రేక్షకులను ఆకట్టుకుంది. లొకేషన్స్, తారక్ - జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ గూస్ బాంబ్స్ తెప్పించాయి. రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ఈ పాటను శిల్పా రావ్ తన గొంతుతో మెస్మరైజ్ చేసేసింది. అనిరుద్ ర‌విచందర్ ఈ సినిమాకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. 

newsline-whatsapp-channel
Tags : tollywood movie-news devara janhvi-kapoor personal-video

Related Articles