GBS: మహారాష్ట్రలో కొత్త సిండ్రోమ్ తో ఒకరి మృతి..!

జీబీఎస్ బారిన పడినవారిలో తిమ్మిర్లు, కండరాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.


Published Jan 27, 2025 07:42:00 PM
postImages/2025-01-27/1737987206_SolapurReportsMaharashtrasFirstSuspectedGuillainBarreSyndromeDeathPuneRecordsOver100Cases.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మహారాష్ట్ర గిలియన్ బారే సిండ్రోమ్ బాధితుడు ఒకరు చనిపోయారు. మృతికి గల కారణం పై ఇంకా స్పష్టత రానప్పటికీ వైద్యులు మాత్రం జీబీఎస్ కారణంగానే మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు.వీరిలో 16 మందికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జీబీఎస్ లో మాత్రం హానికారక క్రిములకు బదులు నరాలపై దాడి చేస్తుంది. జీబీఎస్ బారిన పడినవారిలో తిమ్మిర్లు, కండరాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.


కలుషిత ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కాంపిలో బ్యాక్టర్ జెజునీ బ్యాక్టీరియా అని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ విషయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ చేసే పొరపాటే జీబీఎస్ కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ విషయంలో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ చేసే పొరపాటే జీబీఎస్ కు దారితీస్తుంది. 


ఈ వ్యాధి అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి సోకందని వైద్యులు స్పష్టం చేశారు. జీబీఎస్ బాధితులకు సరైన చికిత్స అందిస్తే కోలుకుంటారని ధైర్యం చెప్పారు. సుమారు 80  శాతం మంది బాధితులు చికిత్స తర్వాత ఆరు నెలల్లో పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. చికిత్సలో భాగంగా రోగికి ఇచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ధర ఒక్కొక్కటి వేలల్లో ఉంటుందన్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu maharastra desease

Related Articles