దీనిపై బాబర్ అజాం సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు. కాంభినేషన్ కోసం టీం చాలా సార్లు సడలింపులు చేశామని అన్నారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో తన టీం గెలుస్తుందని చాలా కూల్ చెబుతున్నాడు పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ . బాబర్ ఆజం ఓపెనర్ గా దిగుతాడా అన్న విషయంపై కూడా అతను చాలా క్లారిటీ ఇచ్చాడు. తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాని అప్పటి సిట్యువేషన్స్ బట్టి టీం ను సెట్ చేసుకుంటానన్నారు.
ఈ ట్రోఫీలోనూ బాబర్ ఆజం ఓపెనర్‌గా దిగుతాడని చెప్పాడు. దీనిపై బాబర్ అజాం సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు. కాంభినేషన్ కోసం టీం చాలా సార్లు సడలింపులు చేశామని అన్నారు . ఈ కారణం వల్లే బాబర్ ఆజం ను ఛాంపియన్స్ ట్రోఫీలోను ఓపెనర్ గా దింపుతున్నట్లు తెలిపారు.మరో ఓపెనర్‌గా ఫఖర్ జమాన్ క్రీజులోకి వస్తాడని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు విజయం సాధించేందుకు టీమ్‌లో అందరూ కఠినంగా శ్రమిస్తున్నారని తెలిపాడు. తన టీం లో అందరూ సారధులేనని తాను ప్రతినిధిగా టాస్ వేసే టైంలో ఉంటానని అన్నారు. అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో పాకిస్థాన్ ఫిబ్రవరి 23న మ్యాచ్ ఆడనుంది.