Anandhi : అంత అందంగా ఉండే హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి !

ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ డైరక్షన్ లో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై సినిమా శివంగి . పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.


Published Feb 20, 2025 01:28:00 PM
postImages/2025-02-20/1740038418_anandi1024x576.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలుగు అమ్మాయి ఆనంది తెలుసుకదా...తెలుగులో కంటే తమిళ్ లో చాలా ఫేమస్ అయ్యింది . చాలా సినిమాల్లో చేసి ఆడియన్స్ ను మెప్పించింది. ఆనంది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని క్లాస్ , క్యూట్ పాత్రలతోనే కనిపించింది. కానీ ఇప్పుడు ఓ మాస్ క్యారక్టర్ చేస్తుంది.


ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రల్లో దేవరాజ్ భరణి ధరణ్ డైరక్షన్ లో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై సినిమా శివంగి . పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. జాన్ విజయ్ , డాక్టర్ కోయకిషోర్ లు ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఆనంది పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని బ్లాక్ బస్టర్ డెరైక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసారు.


ఈ పోస్టర్ లో ఆనంది నల్ల లుంగీ , చొక్కాతో కాలు పై కాలు వేసుకొని కళ్లజోడు పెట్టుకొని సోఫాలో డైనమిక్ గా కనిపించింది. ఇన్నాళ్లు క్యూట్ గా ...స్వీట్ గా గ్లామరస్ గా కనిపించిన హీరోయిన్ కాస్త ఇలా మారిపోయిందేంటని క్వశ్చన్ చేస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మార్చి 7న ఈ శివంగి సినిమా రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu heroine tamil-actor

Related Articles