కొద్దికాలంగా ఇలాంటి వారి ఆటలను ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ ట్విటర్ ద్వారా అరికడుతున్నారు. తాజాగా సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు ఈ లోకల్ బాయ్ నాని. సముద్రంలో మత్స్యకారులుగా తమ జీవితాలను చూపిస్తూ యూట్యూబ్ లో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. అయితే కొన్నేళ్లుగా అదే పనిగా బెట్టింగ్ చేస్తూ ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఉన్నదంతా పొగొట్టుకుంటున్నారు. అప్పల ఊబిలో నుంచి బయటపడలేక చనిపోతున్నారు. అయినా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చెయ్యడంలో ఈ యూట్యూబర్స్ అస్సలు తగ్గడం లేదు. అలా ప్రమోట్ చేస్తున్నవారిలో ఈ యూట్యూబర్ నాని కూడా ఉన్నాడు.
కొద్దికాలంగా ఇలాంటి వారి ఆటలను ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ ట్విటర్ ద్వారా అరికడుతున్నారు. తాజాగా సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు పోస్టుచేస్తూ లోకల్ బాయ్ గా, ఫిషర్ మెన్ గా పాపులర్ అయిన నాని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియోను సజ్జనార్ షేర్ చేశారు. ఏం పోయేకాలం సంపాదించుకొండి. కాని ఇలా కాదు..మీ వ్యాపారాలు మీకు ఉన్నాయి ఎందుకు ఇలా ప్రమోట్ చేసి జనాల ప్రాణాలు తీస్తున్నారంటూ పోస్ట్ చేశారు.
ఆ వీడియోను సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసి బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్లు ఆపండి. అంటూ సూచించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లమని, మేం ఏం చేసిన నడుస్తుందనే భ్రమలో ఉండకండి. చట్టప్రకారం మీకు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు. గత ట్విట్ లో తెలంగాణ కు చెందిన సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ ను సేమ్ ఇలా వార్న్ చేశారు సజ్జనార్.