ఫలితంగా దోమకాటుతో డెంగీ, ఇతర అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. చిన్నారు నుంచి పెద్దవారి వరకు డెంగ్యూ కేసులు చాలా దారుణంగా పెరిగిపోయాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: వాడా .. దోమలు కొడుతున్నాడు...ఈగలు తోలుకుంటున్నాడు. అంటూ వెక్కిరిస్తారు. కాని ఇలా చేస్తున్నందుకు కూడా డబ్బులు ఇస్తారని తెలుసా . అసలు దోమలు పడితే ఎవరైనా డబ్బులిస్తారా అంటారా ..అవును దోమలు పట్టుకుంటే ప్రతి ఐదు దోమలకు రూపాయిన్నర డబ్బులిస్తారు. ఎక్కడా అంటారా ..ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా నగరానికి దగ్గర్లో ఉన్న అడిషన్ హిల్స్ పట్టణంలో లక్షకు పైగా జనాభా ఉంది. ఈ మధ్య కాలంలో అక్కడ దోమల బెడద బాగా పెరిగిపోయింది. ఫలితంగా దోమకాటుతో డెంగీ, ఇతర అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. చిన్నారు నుంచి పెద్దవారి వరకు డెంగ్యూ కేసులు చాలా దారుణంగా పెరిగిపోయాయి.
ముఖ్యంగా వేల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. డెంగీ కారణంగా మరణాలూ సంభవిస్తున్నాయి. ఫలితంగా ఆ పట్టణ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.అందుకే దోమలను అరికట్టే ప్రణాళికలో భాగంగా అక్కడి నాయకుడు ఒకరు వినూత్నమైన ఆలోచన చేశాడు. దోమలు పట్టుకొని ...తీసుకురండి.బ్రతికి ఉన్నా ..చనిపోయినా ఎలా ఉన్నా దోమలు పట్టుకొని తీవసుకువస్తే చాలు ఐదు దోమలు తెచ్చి ఇస్తే.. ఒక ఫిలిప్పైన్స్ పెసో (భారత కరెన్సీలో రూపాయిన్నర) ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.