Allu Arjun: హాలివుడ్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై అల్లు అర్జున్ !

ప్రపంచ ప్రఖ్యాత సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్.. ది హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్ పేరుతో భారత్‌లోనూ అడుగు పెట్టింది.


Published Feb 20, 2025 02:11:00 PM
postImages/2025-02-20/1740040932_389530bunny.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  పుష్ప 2 సినిమాతో ఇంటర్నేషనల్  గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా హాలివుడ్ ను సైతం ఆకర్షించడంతో గ్లోబల్ స్టార్ గా మారాడు. ప్రపంచ ప్రఖ్యాత సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్.. ది హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్ పేరుతో భారత్‌లోనూ అడుగు పెట్టింది.ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ పై అల్లు అర్జున్ ఫొటోను ఎంపిక చేశారు.


ది హాలివుడ్ రిపోర్టర్ 1930 నుంచి డైలీ ట్రేడ్ పేపర్ గా విదేశాల్లో చాలా ఫేమస్ . ఈ పత్రికకు ఆన్ ‌లైన్ ఎడిషన్ కూడా ఉంది. అయితే ఈ మ్యాగజైన్ ఇండియన్ మార్కెట్ పై ఫోకస్ చేస్తుంది. మరి భారత్ లో ఎంట్రీ కోసం కవర్ పేజ్ లో ఇప్పుడు ఫేమస్ అవుతున్న అల్లుఅర్జున్ కవర్ పేజ్ ఫొటో షూట్ ను కూడా నిర్వహించింది.


ఇండియన్ బాక్సాపీస్ దగ్గర నడుడిగా మంచి గుర్తింపు తెచ్చుకొని,...నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కు ఇది చాలా పెద్ద అవకాశం . ఇంత సక్సస్ చూశాక కూడా ఎలాంటి గర్వం లేని చాలా మందిని చూశాను. ఏదైన వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందన్నారు.  పుష్ప 2 సినిమా దాదాపు రూ. 1871 కోట్లు వచ్చాయి. పుష్ప 2 దేశంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సినిమా . ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్, అట్లీ డైరక్షన్ లో రెండు సినిమాల్లో నటించబోతున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu allu-arjun hollywood

Related Articles