తొలి మ్యాచ్ లోనే ముంబయి ఇండియన్స్ కు షాక్ తగలనుంది. ఈ మ్యాచ్ కు కెప్టెన్ హార్ధిక్ పాండ్య దూరం అవుతున్నాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : 20254 ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న కోల్ కత్తా ఆర్సీబీ మ్యాచ్ తో ఈ ఎడిషన్ కు తెర లేవనుంది. ఇక రెండో రోజే ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లు ముంబాయి ఇండియన్స్ _చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. టోర్నీ ప్రారంభంలోనే ఈ హై ప్రొఫైల్ మ్యాచ్ ఉండడం వల్ల మరింత హైప్ క్రియేట్ అవ్వనుంది.అయితే తొలి మ్యాచ్ లోనే ముంబయి ఇండియన్స్ కు షాక్ తగలనుంది. ఈ మ్యాచ్ కు కెప్టెన్ హార్ధిక్ పాండ్య దూరం అవుతున్నాడు.
2024 ఎడిషన్‌లో ముంబయి మూడుసార్లు స్లో ఓవర్ రేట్‌కు గురైంది. నిజానికి ఐపీఎల్ నిబంధనల ప్రకారం సింగిల్ సీజన్ లో ఓ జట్టు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఓవర్ రేట్ కు గురైతే , ఆ టీమ్ కెప్టెన్ పై ఒక మ్యాచ్ పై నిషేధం పడుతుంది. లాస్ట్ సీజన్ లీగ్ దశలోనే హార్ధిక సస్పెన్షన్ కు గురయ్యాడు. ఈ సీజన్ లో ముంబయి క్వాలిఫైయడ్ అవ్వలేకపోవడం వల్ల హార్ధిక్ పై సస్పెన్షన్ కొనసాగుతూ వచ్చింది. తాజా ఎడిషన్ లో తొలి మ్యాచ్ కు హార్ధిక్ దూరం కానున్నాడు.
ప్రస్తుత ముంబయిలో ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు. ఇప్పుడు హార్ధిక్ స్థానంలో ఎవరుంటారనేది ఇంట్రస్టింగ్ గా మారింది. అటు స్టార్ పేసర్ బుమ్రా కూడా టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఉన్నాయి.ఈ మ్యాచ్ మార్చి 23 చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.