విజ్ఞేష్ శివన్, నయనతారలు వేణు స్వామి చేసిన పుకార్లను పక్కనపెట్టి ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. వీరు పెళ్లయితే విడాకులు తీసుకుంటారని వేణు స్వామి కామెంట్లు చేశారు.అయినా కూడా ఈ జంట ఎంతో కలిసి
న్యూస్ లైన్ డెస్క్: విజ్ఞేష్ శివన్, నయనతారలు వేణు స్వామి చేసిన పుకార్లను పక్కనపెట్టి ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని గడుపుతున్నారు. వీరు పెళ్లయితే విడాకులు తీసుకుంటారని వేణు స్వామి కామెంట్లు చేశారు.అయినా కూడా ఈ జంట ఎంతో కలిసిమెలిసి ఉంటున్నారు. ఓ పక్క పర్సనల్ లైఫ్ ని మెయింటైన్ చేసుకుంటూనే మరో పక్క సినీ లైఫ్ ని కూడా వీరిద్దరూ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అయితే అలాంటి నయనతార భర్త ముందే మరో హీరోతో రొమాన్స్ చేసిందట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ రొమాన్స్ చేసిన సమయంలో భర్త ఏమన్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
నయనతార భర్త ముందే వేరే హీరోతో రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడిందట.కానీ భర్త మాత్రం పర్లేదు చేయు అంటూ ఎంకరేజ్ చేశారట. ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన నయనతార పెద్ద సైకోలా ఉన్నావే అంటూ షాకింగ్ కామెంట్లు చేసిందట.ఇక అసలు విషయం ఏమిటంటే..విజ్ఞేష్ శివన్ డైరెక్టర్ అనే సంగతి మనకు తెలిసిందే.విజ్ఞేష్ దర్శకత్వం వహించిన నానుమ్ రౌడీ ధాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నయనతార హీరోగా విజయ్ సేతుపతి చేశారు. ఈ సినిమా షూటింగ్లోనే విజ్ఞేష్ నయన్ లు ప్రేమలో పడ్డారు.
అయితే ప్రియుడు అంటే విజ్ఞేష్ ముందే విజయ్ సేతుపతితో రొమాన్స్ చేయడానికి నయన్ చాలా ఇబ్బంది పడిందట. దాంతో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో సరిగ్గా చేయలేదట.ఇక ఇది గమనించిన విజ్ఞేష్ శివన్ ఇంకా డెప్త్ గా రోమాన్స్ చేయాలి అని చెప్పారట. దాంతో కోపంతో ఊగిపోయిన నయనతార ఇంకెంత డెప్త్ గా చేయాలి. సైకో లాగా మాట్లాడుతున్నావ్..అని గట్టిగా అరిచేసి అక్కడి నుండి వెళ్లిపోయిందట.
ఆ తర్వాత సినిమా అన్నాక రొమాంటిక్ సీన్స్ ఉండి ఆ రొమాంటిక్ సన్నివేశాలు బాగా రాకపోతే ఎలా ఉంటుంది చెప్పు అని నయనతార ని విగ్నేష్ బుజ్జగించారట.ఆ తర్వాత విజ్ఞేష్ మాటలు విని రియలైజ్ అయ్యి మళ్ళీ షూటింగ్లో పాల్గొందట. అలా ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా సార్లు నయన్ విజ్ఞేష్ లు గొడవపడ్డారట. కానీ మళ్ళీ చివరికి కలిసి పోయే వారట. దాదాపు7 ఏళ్లు సహజీవనం చేశాక నయనతార, విజ్ఞేష్ శివన్ లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు