Akash puri: పూరి జగన్నాథ్ కొడుకు పెళ్లా..పేరు మార్పు వెనుక  కారణం.!

పూరి జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ టెన్ దర్శకులలో ఈయన కూడా ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఆయన మానియా కాస్త తగ్గిపోయింది


Published Jul 28, 2024 05:16:53 AM
postImages/2024-07-28/1722161772_akash.jpg

న్యూస్ లైన్ డెస్క్: పూరి జగన్నాథ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ టెన్ దర్శకులలో ఈయన కూడా ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఆయన మానియా కాస్త తగ్గిపోయింది కానీ,  ఒకప్పుడు పూరి సినిమా కోసం నటీనటులు ఎంతో వెయిట్ చేస్తూ ఉండేవారు.  ఈ విధంగా ఎంతో మంది హీరో హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన పూరి జగన్నాథ్ తన సొంత కొడుకు అయినటువంటి ఆకాష్ పూరికి  లైఫ్ ఇవ్వలేకపోతున్నాడు.

అయితే ఆకాష్ పూరి చైల్డ్ ఆర్టిస్ట్ గా చిరుత సినిమాలో నటించారు.  ఆ తర్వాత గబ్బర్ సింగ్, బిజినెస్ మ్యాన్, బుజ్జిగాడు, వంటి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. అలాంటి ఆకాష్ "ఆంధ్రపోరి" అనే మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత మెహబూబా, రొమాంటిక్ చోర్ బజార్, వంటి చిత్రాలు కూడా చేశారు.  

కానీ ఇంతవరకు ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో  ఆకాష్ పురికి ఒక పెద్ద హిట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారట. అయితే ఆయన జాతకం ప్రకారం  పేరు మారిస్తేనే సక్సెస్ అందుకుంటారని తెలియడంతో ఆకాష్ పూరి పేరు మార్చేసి ఆకాష్ జగన్నాథ్ అని పెట్టుకున్నారట. జూలై 25 వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా ఈ పేరు చేంజ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ పేరు మార్చుకున్న తర్వాత అయినా ఆయన కలిసి వస్తుందా లేదా అని చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాదు పేరు మార్పు అనేది పెళ్లి సమయంలో కూడా చేస్తారని  కొంపదీసి ఆకాష్ కు పెళ్లి గాని చేయడం లేదు కదా అంటూ ఫన్నీగా కామెంట్స్ కూడా పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood puri-jagannadh akash-puri andra-pori-movie

Related Articles