Raviteja : మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల.. వింటేజ్ లుక్ లో రవితేజ అదుర్స్

అదరగొడుతున్న రవితేజ మిస్టర్ బచ్చన్ టీజర్. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.


Published Jul 28, 2024 10:43:48 PM
postImages/2024-07-29/1722224613_IMG20240729090816640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్: హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న చిత్రం ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌’. ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌‌‌‌ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది. 

 

ఇప్పటికే పాటలతో ఇంప్రెస్ చేసిన మేకర్స్.. ఆదివారం రిలీజ్ చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు. ఇందులో సిన్సియర్ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌టాక్స్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా వింటేజ్ లుక్‌‌‌‌లో రవితేజ అదరగొట్టాడు. ‘ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్.. నల్లధనం.. సక్సెస్, ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాలాంటివి.. వస్తుంటాయ్, పోతుంటాయ్.. యాటిట్యూడ్ ఇంటిపేరు లాంటిది.. 

అది పోయేదాకా మనతోనే ఉంటుంది’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. భాగ్య శ్రీ బోర్సే గ్లామర్ లుక్‌‌‌‌లో కట్టి పడేసింది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్య, ఝాన్సీ ఇతర పాత్రల్లో కనిపించారు. 

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movies movie-news new-movie raviteja latest-news

Related Articles