Asia Cup: టాస్ గెలిచిన థాయిలాండ్.. శ్రీలంక‌తో ఫైట్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన థాయిలాండ్ కెప్టెన్ తిపట్చా పుట్టావోంగ్ బ్యాటింగ్ ఎంచుకుంది.


Published Jul 24, 2024 06:57:27 PM
postImages/2024-07-24/1721827647_srilanka.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్: మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్ టోర్నీ‌లో భాగంగా బుధవారం శ్రీలంక, థాయిలాండ్ జట్ల మధ్య రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన థాయిలాండ్ కెప్టెన్ తిపట్చా పుట్టావోంగ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక చివరి మ్యాచ్‌లో శ్రీలంక గ్రాండ్ మలేషియా జట్టుపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆ మ్యాచ్‌లో చమరి ఆటపట్టు తుఫాన్ సెంచరీతో చెలరేగింది. ఈ మ్యాచ్‌లో కూడా ఆదే ఫామ్‌ను కొనసాగించాలని ఆటపట్టు పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధిస్తే నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది.


థాయిలాండ్ మహిళ జట్టు: నట్టయా బూచతం, అఫిసర సువాన్‌చోంరాతి, నన్నపట్ కొంచరోయెంకై(w), ఫన్నిత మాయ, చనిదా సుత్తిరువాంగ్, సువానన్ ఖియాటో, సులీపోర్న్ లావోమి, రోసెనన్ కనోహ్, ఒన్నిచా కమ్‌చోంఫు, తిపట్చా పుట్టావోంగ్(కెప్టెన్), చౌంగ్‌రాట్‌చా పుత్తావ్,

శ్రీలంక మహిళ జట్టు: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, హాసిని పెరీరా, అనుష్క సంజీవని(w), కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సుగండిక కులస్ కుమారి, అచిని.

newsline-whatsapp-channel
Tags : won-the-toss asia-cup cricket-news srilanka

Related Articles