Virat:విరాట్ కోహ్లీ అనుష్క రాత్రి 7గ"వరకే తింటారట కారణం..!

ప్రపంచ క్రికెట్ క్రీడాకారుల్లో  మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నటువంటి క్రీడాకారుడు విరాట్ కోహ్లీ అని చెప్పవచ్చు.  ఇక ఇండియన్ ప్రజలయితే విరాట్ కోహ్లీని ఎంతో ఇష్టపడతారు. అలాంటి కోహ్లీ ఇంత వయసు వచ్చిన చాలా ఫీట్ గా ఉంటుంటారు. దీనికి ప్రధాన కారణం ఆయన ఏదైనా ఫుడ్ విషయంలో డైట్ చేస్తారంటే అది కాదట. విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ  ఎక్కడున్నా ఫుడ్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా వహిస్తారట. ఏ ప్లేస్ లో ఉన్నా కానీ సాయంత్రం ఏడు గంటల లోపే ఆహారం తీసుకుంటారట.


Published Jul 09, 2024 06:59:00 PM
postImages/2024-07-09/1720530538_virat.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రపంచ క్రికెట్ క్రీడాకారుల్లో  మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నటువంటి క్రీడాకారుడు విరాట్ కోహ్లీ అని చెప్పవచ్చు.  ఇక ఇండియన్ ప్రజలయితే విరాట్ కోహ్లీని ఎంతో ఇష్టపడతారు. అలాంటి కోహ్లీ ఇంత వయసు వచ్చిన చాలా ఫీట్ గా ఉంటుంటారు. దీనికి ప్రధాన కారణం ఆయన ఏదైనా ఫుడ్ విషయంలో డైట్ చేస్తారంటే అది కాదట. విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ  ఎక్కడున్నా ఫుడ్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా వహిస్తారట. ఏ ప్లేస్ లో ఉన్నా కానీ సాయంత్రం ఏడు గంటల లోపే ఆహారం తీసుకుంటారట.

7 దాటితే ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వదని, మనం తిన్న ఫుడ్డు శరీరానికి అంతగా ఎనర్జీ ఇవ్వదని వారు భావిస్తారు. పూర్వకాలంలో చాలామంది  ఏడు గంటల వరకు ఫుడ్ తిని ఎనిమిది గంటల వరకు మంచిగా నిద్రపోయేవారు. మళ్లీ ఉదయాన్నే  నాలుగు గంటల వరకు నిద్రలేచి  వారి పనులు మొదలుపెట్టేవారు. అందుకే వారు 100 సంవత్సరాలకు పైగా బ్రతకగలిగారు.

కానీ ప్రస్తుత కాలంలో దానికి రివర్స్ గా రాత్రి 12 గంటల వరకు తిని, ఉదయం 12 గంటల వరకు పడుకునే వాళ్ళు ఉన్నారు.  దీనివల్ల ఫుడ్ విషయంలోనే కాకుండా మనిషి ఆరోగ్యం విషయంలో కూడా తేడాలు వచ్చి అనేక రోగాలు వస్తున్నాయి.  అలాంటి ఈ తరుణంలో విరాట్ కోహ్లీ పూర్వకాలంలో పెద్దలు ఏ విధంగా అయితే డైట్ ఫాలో అయ్యారో ఆ విధంగానే ఫుడ్ విషయంలో మాత్రం తప్పక పాటిస్తారట. కోహ్లీ, అనుష్క ఇద్దరు కలిసి సాయంత్రం ఏడు గంటల వరకే  వారు తినాలనుకున్న ఫుడ్ తింటారట. అందుకే ఇప్పటికి విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు 20 ఏళ్ల యంగ్ పిల్లల్లా కనిపిస్తూ ఉంటారు.

newsline-whatsapp-channel
Tags : food, virat-kohli anushka-sharma 7pm

Related Articles