కోవిడ్ టైంలో తనకు రోడ్డు మీద దొరికాడట అలెక్స్. వెంటనే ఈ అహ్మద్ ఇంటికి తీసుకెళ్లాడు.వెటర్నరీ డాక్టర్‌తో వైద్య చికిత్స చేయించడంతో అలెక్స్ గాయాలు మానాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జరిగితే జల్లెడతో నీళ్లు పట్టొచ్చు...సామెతలా ఉంది వ్యవహారం. డబ్బులున్నోళ్లు ఎవ్వరికైనా బర్త్ డే చేస్తారు..ఇలా బోలెడు కామెంట్లు మధ్య ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లా గంగానగర్‌కు చెందిన డాక్టర్ షమీమ్ అహ్మద్ జంతు ప్రేమికుడు. ప్రస్తుతం ట్రాన్స్లామ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ షమీమ్ అహ్మద్ సేవలు అందిస్తున్నారు. తన ఐదేళ్ల డాగ్ అలెక్స్ కు బర్త్ డే చేశాడు.
కోవిడ్ టైంలో తనకు రోడ్డు మీద దొరికాడట అలెక్స్. వెంటనే ఈ అహ్మద్ ఇంటికి తీసుకెళ్లాడు.వెటర్నరీ డాక్టర్‌తో వైద్య చికిత్స చేయించడంతో అలెక్స్ గాయాలు మానాయి. ప్రొఫెసర్ షమీమ్ వివాహం చేసుకోలేదు. తనకు తోడు ఈ అలెక్స్ మాత్రమే. అయితే తన కోసం ఏదైనా చెయ్యాలనుకున్నాడు . వెంటనే ప్లాన్ చేసుకొని డాగ్ కు 5వ హ్యాపీ బర్డ్ డే చేశాడు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, రాజస్థాన్, బిహార్, కేరళ, మధ్యప్రదేశ్ వంటి దాదాపు 10 రాష్ట్రాల నుంచి 500 మందికిపైగా అతిథులు తరలి వచ్చారు. బర్త్ డే లో 11 కేజీల కేక్ ను కట్ చేశారు. 30 రకాల వంటకాలతో సూపర్ గా సెలబ్రేట్ చేశారు.
ఓ లక్కీ డ్రా కూడా ఏర్పాటు చేశారు. లక్కీ డ్రా పోటీలలో లక్కీ కూపన్ గెల్చుకున్న వారికి రిఫ్రిజిరేటర్‌ను గిఫ్టుగా డాక్టర్ షమీమ్ అందజేశారు. ఒక్కటి కాదు...మ్యూజిక్ ..రిటర్న్ గిఫ్ట్స్ , డాన్స్ ప్రొగ్రామ్ ఇలా చాలా గ్రాండ్ గా బర్త్ డే చేసుకుంది . అంతేకాదండోయ్ అలెక్స్ కోసం ఓ స్పెషల్ బంగ్లాను కట్టారు. అది కూడా పూర్తిగా గ్లాస్ తో ..హ్యాపీగా ఏసీ వేసుకొని పడుకుంటుంది. దీనికి బోలెడు మంది పనివాళ్లు కూడా ఉంటారు. ఈ వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఏదైనా రాసి పెట్టి ఉండాలంటున్నారు నెటిజన్లు.