బీచ్ లో ఓ ప్రతినిధి ఉచిత పారా సైలింగ్ రైడ్ ఆఫర్ చేయడంతో టియానా అంగీకరిచినట్లు తెలుస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మాంటెనెగ్రోలో పారాసైలింగ్ చేస్తూ సూసైడ్ కు ప్లాన్ చేసింది ఓ అమ్మాయి. అది సూసైడ్ అనాలో..భయంతో దూకేసిందో ..ఏమయ్యిందో తెలీదు కాని మొత్తానికి సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయింది. సెర్బియాకు చెందిన 19 ఏళ్ల టియానా రాడోన్‌జిక్ సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గత వారం బుడువాలోని అడ్రియాటిక్ సముద్రంలో చోటు చేసుకుంది.
సెర్బియాకు చెందిన టియానా తన అత్తతో కలిసి విహారయాత్ర కోసం బుడువాకు వచ్చింది. బీచ్ లో ఓ ప్రతినిధి ఉచిత పారా సైలింగ్ రైడ్ ఆఫర్ చేయడంతో టియానా అంగీకరిచినట్లు తెలుస్తుంది. పారా సైలింగ్ చేస్తుండగా సడన్ గా చాలా భయపడింది. వెంటనే తన లైఫ్ జాకెట్ , సేఫ్టీ బెల్ట్ విప్పేసి..సుమారు 160 అడుగుల ఎత్తు నుంచి సముద్రంలోకి పడిపోయి చనిపోయింది. "పానిక్ అటాక్" కారణంగానే టియానా ఈ చర్యకు పాల్పడిందని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
పారా సైలింగ్ సంస్థ యజమాని మిర్కో క్రడ్జిక్ ఈ ఘటన పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "యాక్టివిటీకి ముందు టియానా బాగానే ఉంది, ఆమె భయపడినట్లు కనిపించలేదు. పారాసైలింగ్ కు ముందు శిక్షణ కూడా ఇచ్చాం. పైకి వెళ్లాక ఏం జరిగిందో అర్ధం కావడం లేదు . అన్ని పరికరాలను సాంకేతికంగా తనిఖీ చేస్తున్నాం. పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామంటు తెలిపారు.
![]()
Tags : newslinetelugu viral-video