Shine Tom Chacko: డ్రగ్స్ మత్తులో నాకు టార్చర్ చూపించాడు !

ఈ క్రమంలో మలయాళ, తమిళ తెలుగు సినిమాల్లో మంచి వర్సటైల్ యాక్టర్ గా చెప్పుకునే చాకో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.


Published Apr 17, 2025 04:13:00 PM
postImages/2025-04-17/1744886672_vincyaloshiousshinetom.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మలయాళీ నటి విన్సీసోనీ  అలోషియస్ చాలా సినిమాల్లో నటించి మంచిగుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక సినిమా సెట్స్ లో ఓ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. కానీ అతని పేరు వెల్లడించలేదు. ఈ క్రమంలో మలయాళ, తమిళ తెలుగు సినిమాల్లో మంచి వర్సటైల్ యాక్టర్ గా చెప్పుకునే చాకో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు.


టాలీవుడ్‌లోకి నాని దసరా చిత్రంతో అడుగుపెట్టాడు. ఈ మూవీలో షైన్ టామ్ చాకో విలన్ గా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత షైన్ టామ్ చాకో రంగబలి, దేవర , డాకు మహారాజ్ , రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో నటించారు. అధ్భుతమైన అవకాశాలు వస్తున్న తరుణంలో అతడిపై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రముఖ నటుడు సినిమా సెట్‌లో బహిరంగంగా డ్రగ్స్ తీసుకుని ఇబ్బంది పెట్టాడని ఆ వీడియోలో విన్సీ చెప్పింది. ఇప్పుడు ఆమే షైన్‌ టామ్ చాకో డ్రగ్స్ మత్తులో అసభ్య ప్రవర్తించడని ఫిర్యాదు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. 


ఓ వీడియోలో సుత్రవాక్యం అనే సెట్ లో తనతో షైన్ టామ్ చాకో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది విన్సీ. సినిమా షూటింగ్ టైంలో అతను డ్రగ్స్ వాడుతున్నాడు. ఆ విషయం సెట్ లో అందరికి తెలుసు. అంతగా తెలియని వ్యక్తితో యాక్ట్ చేయడం ,డ్రగ్స్ వాడే వారితో పనిచెయ్యడం ఇంకా కష్టమని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu dasara-movie malayalam-film-industry

Related Articles