మెగా ఫ్యామిలీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి గొప్ప హీరోగా ఎదిగారు. ఈయన నట వారసత్వాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్
న్యూస్ లైన్ డెస్క్: మెగా ఫ్యామిలీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి గొప్ప హీరోగా ఎదిగారు. ఈయన నట వారసత్వాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ నాగబాబు స్టార్స్ అయ్యారు. ఇక వీరే కాకుండా వీరి తర్వాత జనరేషన్ కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అనే మొక్క ఇండస్ట్రీలోకి వచ్చి పెద్ద వృక్షం అయిపోయింది. ఇండస్ట్రీలో మెగా మానియానే నడుస్తోంది.
కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయరంగంలో కూడా మెగా ఫ్యామిలీ అద్భుతంగా రాణిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక వెలుగు వెలుగుతున్న మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నారట. అయినా ఎన్ మీడియా పేరుతో న్యూస్ ఛానల్ లాంచ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరవ్వాల్సి ఉంది. కానీ బిజీగా ఉండటంతో కుదరలేదట. దీంతో నాగబాబు సతీమణి నీరజ కూతురు నిహారిక రిబ్బన్ కట్ చేసి ఆఫీస్ ప్రారంభించారట. అయితే ప్రస్తుత కాలంలో కొన్ని కొన్ని పార్టీలకు కొన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఆ చానల్స్ వల్లే ఆ పార్టీలు ఎదగలిగాయి. ఇదే తరుణంలో మెగా ఫ్యామిలీ కూడా ఒక మీడియా ఛానల్ పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన చేసిందట. దీంతో ఎన్ ఛానల్ అనే పేరు పెట్టారట.
ఈ ఆఫీస్ ఓపెనింగ్ ఫంక్షన్ లో నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టారట. ఈ ఫోటోను ఒక అభిమాని స్కెచ్ వేసి బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో కొంతమంది నీకు మీ బ్రదర్స్ లో ఎవరంటే ఎక్కువ ఇష్టమని అడగగా నాగబాబు టక్కున నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టమని అన్నారట. అలాగని అన్న మీద ఇష్టం లేదని కాదు, తమ్ముడు చిన్నవాడు కాబట్టి మేము అన్నదమ్ములమిద్దరం పవన్ ను చిన్న పిల్లాడిగా చూసుకుంటామని నాకు అందుకే పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారట.