PAK vs NZ: వారెవ్వా.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో తొలి శతకం..విల్ యంగ్ అధ్భుతం !

అతడు సెంచరీ చేసిన సమయానికి డెవెన్ కాన్వే 10, కానె విలియమ్సన్‌ 1, డరిల్ మిచెల్‌ 10, టామ్ లేథమ్‌ 45 (నాటౌట్) పరుగులు చేశారు.


Published Feb 19, 2025 10:15:00 PM
postImages/2025-02-19/1739983583_AA1zm5Fz.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రోజు పాకిస్థాన్ & న్యూజిలాండ్  మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి పాకిస్థాన్ బౌలింగ్ ను ఎంపిక చేసుకుంది. 107 బంతుల్లో విల్‌యంగ్ ఒక సిక్సు, 11 ఫోర్ల సాయంతో శతకం బాదాడు. అతడికి టామ్ లేథమ్ చక్కని సహకారం అందించాడు.  కివీస్‌ ఓపెనర్‌ విల్‌యంగ్‌ మొదటి నుంచి మెరుపులు మెరిపించాడు. అతడు సెంచరీ చేసిన సమయానికి డెవెన్ కాన్వే 10, కానె విలియమ్సన్‌ 1, డరిల్ మిచెల్‌ 10, టామ్ లేథమ్‌ 45 (నాటౌట్) పరుగులు చేశారు.


అయితే విల్ యంగ్ శతకం బాదే టైంకి న్యూజిలాండ్ స్కోరు 175/3 (35 ఓవర్లు)గా ఉంది. పాకిస్థాన్ బౌలర్లలో నసీం షా, అబ్రర్ అహ్మద్, హ్యారీ రౌఫ్‌కు తలో వికెట్‌ దక్కాయి. న్యూజిలాండ్ టీం డేవన్ కాన్వే , విల్ యంగ్ , కేన్ , డారిల్ , టామ్ లేథమ్ , బ్రాస్ వెల్ , మిచెల్ సాంట్నర్ , నాథన్ స్మిత్ , మ్యాట్ హెన్రీ , విలియమ్ రౌర్కీ


ఇక పాకిస్థాన్ టీం లో జమాన్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, రిజ్వాన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షహీన్‌ అఫ్రిది, నసీమ్‌ షా, హారిస్ రవూఫ్‌, అబ్రార్ అహ్మద్ ఉన్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu cricket-news championship-trophy cricket-player

Related Articles