Pop singer: టేలర్‌ స్విఫ్ట్‌ కాన్సర్ట్‌పై దాడి..?

ఆస్ట్రియాలోని ఓ ఇంట్లో కెమికల్ పదార్థాలను, టెక్నికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరిలో ఓ నిందితుడి ఇంట్లో ఐసిస్‌, అల్‌ఖైదా ఉగ్రసంస్థల మెటీరియల్‌ లభ్యమైనట్లు పేర్కొన్నారు. 


Published Aug 08, 2024 04:26:40 PM
postImages/2024-08-08/1723114600_taylor.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రముఖ పాప్‌ స్టార్‌, గ్రామీ అవార్డు విన్నర్ టేలర్‌ స్విఫ్ట్‌ కాన్సర్ట్‌పై దాడి చేసేందుకు ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఆస్ట్రియాలోని వియన్నా వద్ద ఏర్పాటు చేసిన ఆమె  కాన్సర్ట్‌పై దాడి చేసేందుకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. దీంతో టేలర్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందడంతో ఆస్ట్రియా అధికారులు వెంటనే యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆస్ట్రియాలోని ఓ ఇంట్లో కెమికల్ పదార్థాలను, టెక్నికల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరిలో ఓ నిందితుడి ఇంట్లో ఐసిస్‌, అల్‌ఖైదా ఉగ్రసంస్థల మెటీరియల్‌ లభ్యమైనట్లు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే, వియన్నాలో జరగనున్న టేలర్‌ స్విఫ్ట్‌ కాన్సర్ట్‌ను టార్గెట్ చేసుకొని ఈ దాడికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అయితే, అప్పటికే అప్రమత్తమైన అధికారులు టేలర్‌ స్విఫ్ట్‌ కాన్సర్ట్‌ ఏర్పాటు చేస్తున్న సంస్థకు సమాచారం అందించారు. దీంతో అనే కాన్సర్ట్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu taylorswift taylorswifterastourvienna erastour

Related Articles