అక్కినేని హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థ కార్యక్రమం ఆగస్టు 8వ తేదీన ఒక ప్రైవేట్ ఈవెంట్ లో నిర్వహించారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్
న్యూస్ లైన్ డెస్క్:అక్కినేని హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థ కార్యక్రమం ఆగస్టు 8వ తేదీన ఒక ప్రైవేట్ ఈవెంట్ లో నిర్వహించారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టేశారు. దగ్గరికి కుటుంబ సభ్యుల మధ్య ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని పూర్తి చేశారట. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి నాగచైతన్య పెళ్లి ఎప్పుడు అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో అయితే అప్పుడు పెళ్లి ఇప్పుడు పెళ్లి అక్కడ వేదిక ఇక్కడ వేదిక అంటూ అనేక వార్తలు రాస్తూ వస్తున్నారు. మరి నిజంగా నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఎప్పుడో తెలిసిపోయింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..
నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత దృష్టి పెట్టారు. ఇదే తరుణంలో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ముందుగా స్నేహితులుగా ఉన్న వీరు మెల్లిమెల్లిగా ప్రేమికులుగా మారారు. ఇద్దరు కలిసి వెకేశన్స్ వెళ్లడం ఇతర దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయడం ఇలా సీక్రెట్ గా మైంటైన్ చేస్తూ వచ్చారు. ఇక చివరికి ఇద్దరి మనసులు కలిసి పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఇది కుటుంబాల పెద్దలను కూడా ఒప్పించి ఆగస్టు 8వ తేదీన దగ్గర కుటుంబీకుల మధ్య ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు.
ఇదే తరుణంలో వీరి వివాహం గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మీరు వివాహ వేడుక రాజస్థాన్ లేదంటే హైదరాబాదులో జరగవచ్చని తెలుస్తోంది. ఇక్కడ కూడా సెట్ కాకపోతే విదేశాల్లో గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారట. వివాహం ఈ ఏడాది చివరలో అయినా ఉంటుంది లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చ్ లో ఉంటుందట. ఎందుకంటే ప్రస్తుతం నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల పలు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ సినిమాలన్నీ పూర్తి అయిన తర్వాత వీరికి చాలా టైం దొరుకుతుంది. ఇప్పుడు హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చని ఆలోచన చేశారట. అయితే మీరు కమిట్మెంట్ ఇచ్చిన సినిమాలు పూర్తయ్యేసరికి ఈ ఏడాది చివరిదాకా సమయం పడుతుంది. కాబట్టి వీరి పెళ్లి డిసెంబర్ లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఉంటుందని వారి దగ్గర సన్నిహితులు చెబుతున్నట్టు తెలుస్తోంది.