Deepika Padukone:తల్లయిన దీపిక..నెల ముందే కల్కి వచ్చేశాడుగా.?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే అంటే ఇండియా మొత్తంలో తెలియని వారు ఉండరు. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఒక హీరో రేంజ్ లో రెమ్యునరేషన్


Published Aug 24, 2024 04:00:25 PM
postImages/2024-08-24/1724495425_deepikapadukone12.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే అంటే ఇండియా మొత్తంలో తెలియని వారు ఉండరు. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఒక హీరో రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్ గా చరిత్ర సృష్టించిందని  చెప్పవచ్చు. ఒక చిత్రానికి 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. అలాంటి దీపిక తాజాగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చినటువంటి కల్కి 2898ఏడి చిత్రంలో నటించింది.

ఈ సినిమా ద్వారానే ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈమె ప్రెగ్నెంట్ అయింది.  అంతేకాదు సినిమాలో కూడా ఈమె ప్రెగ్నెంట్ తో ఉన్న దాన్ని డైరెక్ట్ గా చూపించారు. ప్రస్తుతం దీపికా పడుకునేకు ఎనిమిదో నెల. ఇంకో నెల అయితే 9 నెలలు  నిండేవి. ఇంతలోనే దీపికా పడుకొనే డెలివరీ అయినట్టు తెలుస్తోంది. తాజాగా ఈమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు సమాచారం.

అంతేకాదు హాస్పిటల్ బెడ్ పై డెలివరీ తర్వాత తన బిడ్డను గుండెలకు హత్తుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో దీపిక అభిమానులు కల్కి, కృష్ణయ్య పుట్టాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయాన్ని దీపిక, రన్వీర్ సింగ్ మాత్రం అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఒక బాబుని ఎత్తుకున్న ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూస్తే మాత్రం ఎడిట్ చేసినట్టే కనిపిస్తోంది. మరి చూడాలి దీనిపై దీపిక రన్వీర్ సింగ్ స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

newsline-whatsapp-channel
Tags : deepika-padukone newslinetelugu ranveer-singh bollywood

Related Articles