Leak: .రిలీజ్ కు ముందే ఫీచర్లు లీక్.. తల పట్టుకున్న ఆ ఫోన్ కంపెనీ!

తక్కువ సమయంలో అద్భుతమైన ఆదరణ పొందిన కంపెనీ ఐకూ. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా వేరియంట్లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్ గా IQOO13 పేరుతో మరో కొత్త మొబైల్ మన ముందుకు రాబోతోంది. 


Published Jul 23, 2024 08:19:38 AM
postImages/2024-07-23/1721736274_iqoo.jpg

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో అద్భుతమైన ఆదరణ పొందిన కంపెనీ ఐకూ. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే చాలా వేరియంట్లు రిలీజ్ అయ్యాయి. ఈ తరుణంలో  IQOO13 పేరుతో మరో కొత్త మొబైల్ మన ముందుకు రాబోతోంది. ఇక ఈ మొబైల్ రిలీజ్ కి ముందే దాని  ఫీచర్స్ రిలీజ్ అయ్యాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం. మనకు అందిన సమాచారం ప్రకారం  BOE iQOO 13 మొబైల్ 2కే రిజల్యూషన్ ఫ్లాట్  OLED ప్యానెల్ కలిగి ఉంటుంది.

అంతేకాకుండా స్క్రీన్ షేప్ మోల్డ్  యొక్క డిజైన్ బోర్డు అంతట  నావికరించబడుతుంది. అంతేకాకుండా ఈ మొబైల్  6.78 INCH  OLED స్క్రీన్ కలిగి ఉండి, దీని పరిమాణంలో ఏదైనా చిన్న మార్పు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్  8 జనరేషన్ 4 మరియు ఆరవ సంఖ్యతో ప్రారంభమయ్యే బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే 6000 ఎంఏహెచ్  బ్యాటరీ ప్యాక్ చేయవచ్చని తెలుస్తోంది.

అలాగే 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో  అద్భుతంగా పనిచేస్తుందట. IQOO 12 తో పోలిస్తే కెమెరా డెకో డిజైన్ చాలా వరకు మారదు. 50 మెగా పిక్సెల్  ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 3X పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉండవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ మిడిల్ ఫ్రేమ్ మరియు గ్లాస్ బ్యాక్  కలిగి ఉంటుందని తెలుస్తోంది.  అలాగే IP68 లేదా IP69 రేటెడ్ డస్ట్ మరియు వాటర్ రెసిస్టేన్స్  కలిగి ఐక్యూ 12 కంటే ఐక్యూ 13 గణనీయమైన అప్ గ్రేడ్ కావచ్చు. ఈ మొబైల్  చైనాలో నవంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu super-camera iqoo13 6000mah-battery features

Related Articles