Happy birthday pawan:పవన్ బర్త్ డే చిరు స్పెషల్ పోస్ట్..!

పవన్ కళ్యాణ్ బర్త్ డే వచ్చిందంటే అభిమానులకు ఒక పండగ వాతావరణమే అని చెప్పవచ్చు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేలు ఇంతకుముందు ఒక తీరు, ఇప్పటినుంచి మరో తీరు అని చెప్పవచ్చు.


Published Sep 02, 2024 12:21:26 PM
postImages/2024-09-02/1725259886_pawankalayan.jpg

న్యూస్ లైన్ డెస్క్:పవన్ కళ్యాణ్ బర్త్ డే వచ్చిందంటే అభిమానులకు ఒక పండగ వాతావరణమే అని చెప్పవచ్చు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేలు ఇంతకుముందు ఒక తీరు, ఇప్పటినుంచి మరో తీరు అని చెప్పవచ్చు. ఇంతకుముందు కేవలం హీరో గానే ఒక పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నారు. ఈ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా  బాధ్యతలు చేపట్టారు ఆయనపై వేలాదిమంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన ప్రియతమ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి చాలా స్పెషల్ గా బర్త్డే విషెస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడి గురించి అద్భుతంగా రాసుకొచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
  
కళ్యాణ్ బాబు..

ప్రతి ఏడాది నీకు పుట్టినరోజు వస్తుంటుంది..  కానీ,  ఈ సంవత్సరం వచ్చిన పుట్టినరోజు చాలా ప్రత్యేకం.. 

 ఆంధ్ర ప్రజలకు కావలసిన టైంలో కావలసిన నాయకుడు, వాళ్ల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రతి పేదింటి పెద్ద బిడ్డగా వచ్చాడు. 

 రాజకీయాల్లో నిలకడ, నిబద్ధత, నీతి, నిజాయితీ కలిగినటువంటి ఒక నాయకుడిగా నిన్ను వాళ్ళ లైఫ్ లోకి ఆహ్వానించారు.  వారి గుండెల్లో నీకు స్థానం ఇచ్చారు.. అది సుస్థిరమైనది.. ప్రస్తుత కాలంలో నీలాంటి నాయకుడు కావాలి రావాలి.. అలాగే ఈ సమాజంలో అద్భుతాలు జరగాలి..  అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావని నమ్మకం నాతోపాటు ఆంధ్ర ప్రజలకి ఉన్నది..

పుట్టినరోజు శుభాకాంక్షలు దీర్ఘాయుష్మాన్ భవ. అంటూ రెండు లవ్ సింబల్స్ యాడ్ చేసి తన ప్రేమను చాటుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ గా మారింది.

https://x.com/KChiruTweets/status/1830441240355053741

 

newsline-whatsapp-channel
Tags : chiranjeevi janasena news-line ap surekha nagababu happy-birthday-pawankalyan

Related Articles